children die: అంతుచిక్కని కారణంతో ఏడుగురు చిన్నారులు మృతి..
ABN , First Publish Date - 2023-03-02T11:13:31+05:30 IST
0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు వ్యాధి సంక్రమణకు ఎక్కువగా గురవుతున్నారు.
ఈమధ్య కాలంలో ఏ కారణాలు లేకుండానే మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి చిన్నా, పెద్దా అనే వయసు భేదం అంతకాన్నా ఉండటం లేదు. కరోనా తరువాత ఎవరిని కదిపినా ఇదే భయంతో వణికిపోతున్నారు. గత సంవత్సరంలో దాదాపు చాలా మంది చిన్నవయసువారే గుండెపోటుతో మరణించారు. పైగా అందులో చాలా వరకూ ఆరోగ్యవంతులు కూడా ఉన్నారు. ఇది ఎందుకు జరిగిందనే దానికి సరైన వైద్యపరమైన వివరణ కూడా లేదు. అలానే ఈమధ్యనే పశ్చిమ బెంగాల్‌లో 24 గంటల్లో శ్వాస ఇబ్బందితో దాదాపు ఏడుగురు చిన్నారులు మరణించారు. దీనికి కూడా సరైన వైద్యపరమైన నివేదికలు కానీ, డిసీజ్ ఏమై ఉంటుందనే నిర్ధారణలు, వివరణలు కానీ లేవు. ఆ అంతుచిక్కని వ్యాధి పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే పరిమితమవుతుందా లేదా మొత్తం దేశాన్నే కుదిపేస్తుందా అనేది కూడా భయంగానే ఉంది.
విషయంలోకి వెళితే..
పశ్చిమ బెంగాల్‌లో 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారని సీనియర్ ఆరోగ్య అధికారి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్(Adenovirus) మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి కొమొర్బిడిటీ(Comorbidity) లక్షణాలుగా ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: వీటిని తీసుకున్నారో.. గుండెపోటు వచ్చే అవకాశం 2 రెట్లు పెరుగుతుంది.. మీ ఇష్టం మరి.
ఇదే రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్‌ఐ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వివిధ వైరస్‌ల కారణంగా ఏర్పడే ARI ఇన్‌ఫెక్షన్‌ల సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది, ఎందుకంటే అడెనోవైరస్ కారణంగా వచ్చే కాలానుగుణ పెరుగుదలలు మునుపటి సంవత్సరాల్లో COVID-19 వైరస్ తరువాత ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది.
ఏది ఏమైనప్పటికీ, 24 గంటల్లో అడెనోవైరస్ కారణంగా ఈమరణాలు సంభవించినట్లు కూడా నిర్థారణగా పేర్కొనలేకపోయారు. మామూలుగా పిల్లలలో, అడెనోవైరస్ శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది ఇప్పటి సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లుగా (ARI) సమస్య అయి ఉంటుందని మాత్రం తెలిపింది. రాష్ట్ర ఆరోగ్య అధికారులు కూడా "ప్రస్తుతం కొనసాగుతున్న వైరల్ మహమ్మారికి ఎటువంటి ఆధారాలు లేవు" అని మాత్రమే వివరణ ఇచ్చింది. ఈ తీవ్ర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 పడకలను సిద్ధంగా ఉంచామని వైద్య బృందం తెలిపింది.
0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు వ్యాధి సంక్రమణకు ఎక్కువగా గురవుతున్నారు. పెద్ద పిల్లలకు వైరస్ సంక్రమణకు తక్కువ అవకాశం కలిగి ఉంటారని, చాలా కేసులను ఇంట్లోనే చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితి పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ప్రభుత్వం వరుస ఆదేశాలను జారీ చేసింది. 24x7 అత్యవసర హెల్ప్‌లైన్ 1800-313444-222ను ప్రకటించింది.