Health Tips: ఖాళీ దొరికితే చాలు వేళ్లను విరుచుకునే అలవాటుందా..? దీని వల్ల జరిగేదేంటో డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!
ABN , First Publish Date - 2023-06-27T11:34:41+05:30 IST
ఇప్పటికి కూడా చాలామంది చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అదేపనిగా వేళ్ళను విరుస్తూ ఉంటారు.
కాస్త ఎక్కువ పని చేసినా వేళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి కాస్త బద్దకంగానే వెనక్కు విరుస్తూ ఉంటాం. అప్పుడు టక్ మనే శబ్దం వస్తూ ఉంటుంది. ఇలా వేళ్ళను వెనక్కు విరిచే అలవాటు చాలామందిలో చూస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఇలా చేయకూడదని, వేళ్ళు విరిస్తే ఇంటికి మంచిది కాదని వారిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలామంది చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అదేపనిగా వేళ్ళను విరుస్తూ ఉంటారు.
వేళ్లు విరుస్తూ ఉండటం అనేది చాలా మందికి అలవాటు. తరచుగా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వేళ్లును విరుచుకోవడం కనిపిస్తుంది. అదే పనిగా వేళ్లను నలిపేస్తూ, వెనక్కు విరవనిదే ఏ పనీ చేయని వారు కూడా ఉంటారు. చేతులతో పాటు, కాలి వేళ్లను విరిచే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
కీళ్ల నొప్పులు, వేళ్లు బలహీనంగా మారడం వంటి అనేక సమస్యలు ఏమైనా దీనివెనుక ఉంటాయా?
తరచుగా కీళ్ళు, కండరాలు మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన కారణాలలు కాకపోయినా సరే ఈ పనిని ఎక్కువగా చేస్తూ ఉంటారట. దీనికి మన చేతివేళ్లలో కొన్ని కీళ్లు ఉన్నాయని, ఈ కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుంది. ఈ ద్రవం కీళ్లపై లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. ఈ ద్రవంలో సహజంగా బుడగలు ఏర్పడతాయి. మనం వేళ్లను వంచినప్పుడు, లాగినప్పుడు లేదా పగులగొట్టినప్పుడు, ప్రతికూల ఒత్తిడి ఏర్పడి కీళ్లలో ఉండే ఈ ద్రవాల బుడగలు పగిలిపోతాయి. ఇదే టక్ మనే శబ్దంగా వినిపిస్తూ ఉంటుంది.
ఇది కూడా చదవండి: పైనాపిల్‌ను తింటే ఇలా కూడా జరుగుతుందా..? చాలా మందికి తెలియని నమ్మలేని నిజమిది..!
ఈ బుడగలు పగిలిపోవడం వల్ల వేళ్ల కీళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. వేళ్లను ఎంత కావాలంటే అంత పగులగొట్టుకోవచ్చని, వేళ్ల ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి ఎలాంటి తేడా లేదని డాక్టర్స్ చెబుతున్నారు. వేళ్లు పగలడం వల్ల వేళ్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది ఆర్థరైటిస్‌కు కారణం కాదు, వేళ్లు ఉబ్బడం, చిక్కగా మారవు. ఇది కేవలం అలవాటుగా చేసే పని మాత్రమే నని నిపుణుల అభిప్రాయం.