Egg Shells: కోడిగుడ్డు పెంకులు పనికి రావని పారేస్తున్నారా..? అవి ఇలా కూడా పనికొస్తాయని అస్సలు ఊహించలేరు..!

ABN , First Publish Date - 2023-06-07T11:08:55+05:30 IST

ఇలాంటప్పుడు గుడ్డు షెల్ సహాయంతో, ఇంట్లో కత్తికి పదును పెట్టవచ్చు.

Egg Shells: కోడిగుడ్డు పెంకులు పనికి రావని పారేస్తున్నారా..? అవి ఇలా కూడా పనికొస్తాయని అస్సలు ఊహించలేరు..!
egg shells

గుడ్లు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ బి2, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్ కూడా ఉన్నాయి. అయితే, ఒక గుడ్డులో 77 కేలరీలు, 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అంతే కాదు, గుడ్డు తొక్కలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్‌తో ప్రతి ఉదయం ప్రారంభమవుతుంది. దీని తరువాత, గుడ్డు పై తొక్కను పారేస్తూ ఉంటాం. కానీ దీనిని చాలా రకాలుగా ఉపయోగించవచ్చట.

గుడ్డు నుండి వంటకం చేసిన తర్వాత, గుడ్డు పెంకుల్ని ఆహారంలో చేర్చుకోవడమే కాకుండా, వంటగదిలోని అనేక చిన్న, పెద్ద సమస్యలను అధిగమించవచ్చు. ఎగ్‌షెల్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

కాఫీలో

మనం తాగే కాఫీలో గుడ్డు పెంకులను జోడించడం ద్వారా దాని లక్షణాలను మరింత పెంచవచ్చట. కాఫీ చేదును తొలగించడంలో గుడ్డు షెల్ సహాయపడుతుందట. దీనితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇలా చేయడానికి ముందు గుడ్డు పెంకును బాగా కడగాలి. తర్వాత పొడి చేసుకోవాలి. దీన్నినిల్వ చేయండి. కాఫీ చేసేటప్పుడు కొద్దిగా కలపండి.

ఇది కూడా చదవండి: పీరియడ్స్‌‌లో ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదని ఎందుకంటారు..? చేస్తే అసలు ఏమవుతుందంటే..!

రసం సూపర్ హెల్తీగా

రసంలో గుడ్డు పెంకులను కలపడం వల్ల ఇందులోని క్యాల్షియం కంటెంట్ పెరగడమే కాకుండా మంచి రుచిని ఇస్తుంది. ముందుగా గుడ్డు పెంకును బాగా కడగాలి. తర్వాత ఎండబెట్టి 8 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి.

కత్తిని పదునుగా చేయచ్చు.

వంటగదిలో ఉన్న కత్తి అంచు క్రమంగా పదును తగ్గడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేన్ని కట్ చేద్దామన్నా కూడా సరిగా పనిచేయదు. ఇలాంటప్పుడు గుడ్డు షెల్ సహాయంతో, ఇంట్లో కత్తికి పదును పెట్టవచ్చు. దీని కోసం, గుడ్డు పెంకులను ఫ్రీజర్‌లో పెట్టి, తర్వాత బయటకు తీసి కత్తితో రుద్దాలి. ఇది కత్తి అంచుని పదును పెట్టేందుకు ఉపయోగిస్తే బావుంటుంది.

క్లీనర్‌గా ఉపయోగించండి.

ఈ గుడ్డు పెంకులను క్లీనర్‌గా ఉపయోగించవచ్చు. దీని కోసం, పొడి చేసిన గుడ్డు పెంకుల పౌడర్ ని తీసుకుని దానితో షింక్ ని శుభ్రం చేయవచ్చు. ఇది సహజంగా తెల్లగా పాచి లేకుండా తయారవుతుంది.

Updated Date - 2023-06-07T11:08:55+05:30 IST