Monsoon Health Tips: వామ్మో.. అసలు కారణం ఇదా..? వర్షాకాలంలో జామకాయలను తప్పకుండా తినాలని ఎందుకు చెప్తారంటే..!

ABN , First Publish Date - 2023-07-24T14:17:27+05:30 IST

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

Monsoon Health Tips: వామ్మో.. అసలు కారణం ఇదా..? వర్షాకాలంలో జామకాయలను తప్పకుండా తినాలని ఎందుకు చెప్తారంటే..!
benefits health.

వర్షాకాలంలో వర్షంతో పరిశరాలన్నీ తేమగా మారిపోతాయి. దీనితో రోగాలు కూడా ఎక్కువే. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఉండాలి. దీనికోసం పండ్లమీద ఆధారపడటం తప్పనిసరి. ఈ పండ్లలో ముఖ్యంగా జామపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. జామపండులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచి సపోర్ట్‌ని ఇస్తాయి. వానాకాలం ఈ పండును తీసుకుంటూ ఉండాలి. జామపండును ఈ కాలంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే వానాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ వర్షాకాల వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

జామకాయలో అధిక డైటరీ ఫైబర్ ఉంటుంది, కాబట్టి ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వర్షాకాలంలో జీర్ణక్రియ సమస్య ప్రతిరోజూ కనిపిస్తుంది. కనుక జామకాయను తరచుగా తీసుకోవడం వల్ల ఈ సమస్య పోతుంది.

hydration ను నిర్వహిస్తుంది.

జామపండులో అధిక నీటి శాతం ఉంటుంది, ఇది తేమతో కూడిన వర్షాకాలంలో hydration ఉంచడంలో సహాయపడుతుంది. ఆహారంలో ప్రతిరోజూ ఒకటి నుండి రెండు జామపండ్లు తీసుకోవాలి. జామకాయను పచ్చిగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ తయారుచేసి తీసుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..

జామపండులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. Oxidation ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ 4 టిప్స్‌ను పాటిస్తే చాలు.. విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా కలిసిపోవడం ఖాయం..!

శ్వాసకోశ ఆరోగ్యం

ముఖ్యంగా వర్షాకాలంలో ఆస్తమా సమస్య పెరుగుతుంది. జామపండులో ఉండే విటమిన్ సి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

జామకాయలో విటమిన్లు ఎ, సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అధిక తేమ వల్ల కలిగే నష్టం నుండి కూడా కాపాడతాయి.


రక్తపోటును నియంత్రిస్తుంది

జామ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

దృష్టిని మెరుగుపరుస్తుంది.

జామపండులో విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, జామ కళ్లను రక్షిస్తుంది.

బరువు తగ్గవచ్చు.

జామపండులో క్యాలరీలు, కొవ్వు సాపేక్షంగా తక్కువగా ఉంటాయి, బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

వాపును తగ్గిస్తుంది.

తేమతో కూడిన పరిస్థితులు వాపు, నొప్పిని తీవ్రతరం చేస్తాయి. జామలో ఉండే సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు నుంచి నొప్పి నుంచి సులువుగా ఉపశమనం కలిగిస్తాయి.

Updated Date - 2023-07-24T14:17:27+05:30 IST