Health Tips: పొరపాటున కూడా ఈ ఐదింటినీ పచ్చిగా ఉన్నప్పుడే తినకండి.. తెలియక తింటే జరిగేది ఇదే..!

ABN , First Publish Date - 2023-06-28T11:35:25+05:30 IST

అసలు ఏ కూరగాయల విషయంలో ఈ తప్పులు చేస్తున్నామో తెలుసుకోవాలి.

Health Tips: పొరపాటున కూడా ఈ ఐదింటినీ పచ్చిగా ఉన్నప్పుడే తినకండి.. తెలియక తింటే జరిగేది ఇదే..!
gastronomical problems

తినే ఆహారం విషయంలో మనకు చాలా విషయాలు తెలియవు. కొన్నింటిని పచ్చిగా తిన్నా, కొన్నింటిని బాగా ఉడికించి తిన్నా కూడా మనకు ఇబ్బందులు తప్పవట. అసలు ఏ కూరగాయల విషయంలో ఈ తప్పులు చేస్తున్నామో తెలుసుకోవాలి. మన రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. బరువు తగ్గాలనుకున్నా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకున్నా, ఈ విషయంలో కూరగాయలు అద్భుతాలు చేస్తాయి.

అయితే, చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు ఏమిటంటే కొన్ని కూరగాయలను ఉడికించి కాకుండా పచ్చిగా తినడం. కొన్ని కూరగాయలలో సహజమైన విషపదార్ధాలు, జీర్ణం కావడానికి కష్టతరమైన చక్కెరలు ఉంటాయి, ఇవి గ్యాస్ట్రోనామికల్ వ్యాధులకు దారితీయవచ్చు. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగినా సరే.., వాటి మీద పురుగుల మందుల ప్రభావం తొలిగినా సరే అవి పచ్చిగా తినడానికి పనిచేయవు. ఎందుకంటే...

పచ్చిగా ఎప్పుడూ తినకూడని కూరగాయలు:

1. బంగాళదుంపలు:

ఉడకని బంగాళాదుంపలు రుచిలో తేడాగా ఉండటమే కాకుండా జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తాయి. బంగాళదుంపలో ఉండే పిండి పదార్ధం ఉబ్బరం, గ్యాస్‌కు దారితీస్తుంది. ఏ రకమైన గ్యాస్ట్రోనమికల్ సమస్యను నివారించడానికి, తినడానికి ముందు బంగాళాదుంపలను బాగా, వేయించడం, ఉడికించడం మంచిది.

2. ఆకు కూరలు:

క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, మొలకలు వంటి కూరగాయలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. ఈ కూరగాయలలో జీర్ణం కావడం కష్టంగా ఉండే చక్కెర ఉంటుంది. ఈ కూరగాయలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి.

ఇది కూడా చదవండి: లావు తగ్గాలనే ప్రయత్నాల్లో.. పొరపాటున కూడా ఈ మిస్టేక్‌ను మాత్రం అస్సలు చేయొద్దు.. అదే జరిగితే..!

3. పుట్టగొడుగులు:

పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు, అయినప్పటికీ, ఎక్కువ పోషకాలను పొందాలంటే మాత్రం ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది. వేయించిన లేదా కాల్చిన పుట్టగొడుగులలో వండని వాటి కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది.

4. మాంసం:

పచ్చి, తక్కువగా ఉడికించిన మాంసం, చికెన్, టర్కీ తినడం చాలా ప్రమాదకరం. చాలా ముడి పౌల్ట్రీలో క్యాంపిలోబాక్టర్ ఉంటుంది. ఇది సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్, ఇతర బ్యాక్టీరియాను కూడా కలిగి ఉండవచ్చు. ఇది ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది.

5. రెడ్ కిడ్నీ బీన్స్:

ఉడికించని లేదా ఉడకని బీన్స్‌లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకోప్రొటీన్ లెక్టిన్ ఉంటుంది, ఇది తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది.

Updated Date - 2023-06-28T11:35:25+05:30 IST