Blood Pressure: వీటి వల్లే మీ బీపీ సర్రున పెరిగిపోతుంది.. తెలుసుకుని జాగ్రత్త పడితే బెటర్..!
ABN , First Publish Date - 2023-02-21T14:03:41+05:30 IST
ధూమపానం, మద్యపానం సిస్టోలిక్ రక్తపోటు కొలతను పెంచుతాయి.
అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్‌తో సహా గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి బీపీ పెరగడం. ఆరోగ్యకరమైన వ్యక్తిలో సాధారణ రక్తపోటు 120/80 mmHg కంటే తక్కువగా పరిగణిస్తాం. ఒక వ్యక్తి రక్తపోటు స్థిరంగా 140/90 mm Hg అంతకంటే ఎక్కువ ఉంటే, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని నిర్ధారణ చేయవచ్చు. అయినప్పటికీ, అనేక కారణాలపై ఆధారపడి రక్తపోటు పరిధి మారుతూ ఉంటుంది. రక్తపోటు రీడింగ్‌ను ప్రభావితం చేసే కొన్ని విషయాలను పరిశీలిద్దాం.
1. రక్తపోటుని తరచుగా చెక్ చేసుకోండి..
ఖచ్చితమైన రక్తపోటు ఉండటానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రోగి చేయి చుట్టుకొలత కఫ్‌లోని సూచికల పరిధిలోకి రానప్పుడు రక్తపోటు కొలత లోపాలు సంభవిస్తాయి. ఇది రోగి సిస్టోలిక్ రక్తపోటు కొలతను 10 mmHg నుండి 40 mmHgకి పెంచుతుందని, అధ్యయనాలు సూచిస్తున్నాయి.
2. ఒత్తిడి, ఆందోళన పెంచవచ్చు.
ఒత్తిడి, ఆందోళన రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదల కారణంగా, హృదయ స్పందన రేటు పెరుగుతుంది, ఫలితంగా అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడమనేది చక్కని ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది.
3. రక్తపోటు విశ్రాంతి తీసుకోవాలి..
రక్తపోటును పరీక్షించే ముందు, 3-5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం, చాలా ముఖ్యం. ఖచ్చితమైన రక్తపోటు ఫలితాలు రావాలంటే కుర్చీపై సౌకర్యవంతంగా ఉండాలి.
4. క్రాస్డ్ కాళ్ళు, చేతులు, వీపు, పాదాలు
రక్తపోటును కొలిచేటప్పుడు, విశ్రాంతిగా, సౌకర్యవంతమైన కుర్చీపై కూర్చోవాలి. చేతులు, వీపు , పాదాలు రిలాక్స్ అవ్వాలి. డయాస్టొలిక్ రక్తపోటు కొలతను 6 mmHg ఉంటుంది. సరిగా కూర్చోకుండా పరీక్ష చేస్తే 2 నుండి 8 mmHg వరకు పెంచుతుంది.
5. ధూమపానం, మద్యపానం, కొలత..
రక్తపోటును పరీక్షించడానికి ముందు ధూమపానం, మద్యపానం సిస్టోలిక్ రక్తపోటు కొలతను పెంచుతుంది. ఇంకా, రక్తపోటు తీసుకునేప్పుడు మాట్లాడటం వలన సిస్టోలిక్ రక్తపోటు కొలత 10 నుండి 15mmHg వరకు పెరుగుతుందని, అధ్యయనాలు సూచిస్తున్నాయి.
6. మూత్రాశయాన్ని ఖాళాగా ఉంచండి.
మూత్రాశయం ఖాళీగా ఉన్నప్పుడు రక్తపోటు తక్కువగా ఉంటుంది. మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉండాలి.