Urine Signs: మూత్రానికి వెళ్లినప్పుడల్లా.. ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. క్షణం కూడా ఆలస్యం చేయకండి..!
ABN , First Publish Date - 2023-06-30T12:41:48+05:30 IST
మూత్రవిసర్జనలో ఇబ్బందితో పాటు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.
చిన్న చిన్న తప్పిదాలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. దీనికి ముఖ్య కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం వీటి మీద పెరుగుతున్న అజాగ్రత్త ఈ రోజుల్లో ప్రజలను అనేక సమస్యలకు గురిచేస్తోంది. ప్రస్తుతం బీపీ, షుగర్ వంటి అనేక సమస్యల బారిన పడేలా చేస్తుంది. ఈ కారణాలకు తగ్గట్టుగా మరో సమస్య కిడ్నీలో స్టోన్స్ పెరగడం. ఇది ఇప్పటి కాలంలో ఎక్కువగా చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. చిన్న ఇబ్బందిగా మొదలై పెద్ద సమస్యగా మారుతూ ప్రజల ఆరోగ్యాలను పాడుచేస్తున్న సమస్య ఇది. మొదట్లో పెద్దగా ఇబ్బంది లాంటిది లేకపోయినా కొన్ని తీవ్రమైన సందర్భాల్లో నొప్పి భరించలేనంతగా ఉంటుంది.
కిడ్నీ మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, దీని పని రక్తాన్ని శుభ్రపరచడం, మూత్రాన్ని తయారు చేయడం. ఇది కాకుండా, కిడ్నీ అన్ని ఆహారాలు, పానీయాల నుండి విషపూరిత మూలకాలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. అయితే ఈ విషపూరిత పదార్థాలు కిడ్నీ నుంచి పూర్తిగా బయటకు రాలేనప్పుడు అవి క్రమంగా పేరుకుపోయి రాళ్ల రూపంలోకి మారుతూ ఉంటాయి. సాధారణంగా కనిపించే రాళ్ల సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే, అది మూత్రపిండాలను దెబ్బతినడం, మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుంది. ఈ పరిస్థితిని దాటాలంటే ఏం చేయాలో చూద్దాం.
పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి..
కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల, బాధితుడు భరించలేని నొప్పిని అనుభవించవచ్చు. ముఖ్యంగా దీని వల్ల వెన్ను, పొట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా నొప్పి ఉంటుంది. రాయి మూత్ర నాళంలోకి వెళ్ళినప్పుడు నొప్పి ఉంటుంది. ఇది మూత్రవిసర్జనలో ఇబ్బందితో పాటు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: కొత్త బూట్లు కొన్న ప్రతీసారీ ఇదే జరుగుతోందా..? ఈ 4 చిట్కాలను కనుక వాడితే..!
మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట
మూత్ర విసర్జన చేయడంలో చాలా ఇబ్బంది ఉంటే, అది మూత్రాశయంలో రాయి ఉండటం వల్లనే కావచ్చు. మూత్ర నాళం (యూరినరీ ట్యూబ్), యూరినరీ బ్లాడర్ (యూరినరీ బ్యాగ్) మధ్య ప్రదేశానికి రాయి చేరినప్పుడు, దీని కారణంగా భయంకరమైన నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిని 'డైసూరియా' అంటారు.
మూత్రంలో రక్తం
మూత్రపిండ రాళ్లు ఏర్పడినప్పుడు దానికి సాధారణ లక్షణాలలో ఒకటి మూత్రంలో రక్తం పడటం. దీనిని 'హెమటూరియా' అని కూడా అంటారు. ఈ సమస్యలో, రక్తం రంగు ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం మొత్తం చాలా తక్కువగా కనిపిస్తుంది.
మూత్రంలో వాసన
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే, మూత్రం బలమైన వాసన ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది.