Sun Burn: ఎండ వేడికి ఒళ్లు పేలిపోతుందని చల్లబరుచుకోవడానికి ఈ ఐదు మాత్రం అస్సలు చేయకండి..!

ABN , First Publish Date - 2023-05-11T12:53:40+05:30 IST

బాత్రూమ్ నుండి బయటికి వచ్చిన వెంటనే, శరీరాన్ని ఆరనివ్వండి

Sun Burn: ఎండ వేడికి ఒళ్లు పేలిపోతుందని చల్లబరుచుకోవడానికి ఈ ఐదు మాత్రం అస్సలు చేయకండి..!
medications

వేసవికాలం వచ్చిందంటే చెమటతో చర్మం చిరాకుగా మారుతుంది. రోజులో ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా రిలీఫ్ ఉండదు. కాలం మార్పనే కాదు. శరీర తత్వాన్ని బట్టి కూడా ఇలాంటి చిరాకులు తప్పవు. ఈ వేసవిలో నచ్చినా నచ్చకపోయినా సరే ఎండకు దూరంగా ఉండటం కష్టం. అందుకే స్కిన్ కేర్‌లో సన్‌స్క్రీన్‌ను వాడుతూ సేఫ్ గా ఉండాలని ప్రతిఒక్కరూ అనుకుంటూ ఉంటారు. వేసవిలో వడదెబ్బకు గురైతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

సన్‌స్క్రీన్ ఎంత ఎండ నుంచైనా చర్మాన్ని కాపాడేస్తుందనే అపోహ పోవాలి. కొద్ది గంటల్లో బయటకు వెళ్ళబోతున్నాం అనేముందు దీనిని చర్మానికి పూయడం వల్ల ఫలితం ఉంటుంది కానీ. వెళ్ళేముందు అంటే అది చర్మాన్ని వడదెబ్బనుంచి రక్షించలేకపోవచ్చు. వడదెబ్బ తగిలిన చర్మానికి ఐస్ ప్యాక్ ఉంచాలా అనేది కూడా సరైన అవగాహనతో చేయాల్సిన పని.

వడదెబ్బ అంటే ఏమిటి?

సూర్యరశ్మిని ఎక్కువగా శరీరానికి, చర్మానికి తగలడం వల్ల చర్మం ఎర్రబడుతుంది. చర్మం కందినట్టుగా మారి, అసౌకర్యంగా అనిపిస్తుంది. వడదెబ్బ తగిలిన తర్వాత చర్మాన్ని తాకడం వల్ల వేడిగా అనిపిస్తుంది.

సన్ బర్న్ పెట్టకూడని వస్తువులు

వడదెబ్బకు గురైనప్పుడు సూర్యరశ్మికి గురయ్యే భాగాలు బాగా ప్రభావితమవుతాయి. టోపీలు, సన్ గ్లాసెస్, గ్లోవ్స్ , పొడవాటి చేతుల టాప్‌లతో కప్పిన భాగాలు ఎండనుంచి సేవ్ అవుతాయి.

ఇది కూడా చదవండి: వేసవిలో పెదవులు పగిలిపోతున్నాయా? ఇది ప్రయత్నించి చూడండి..!

1. పెట్రోలియం జెల్లీని ఉపయోగించవద్దు.

పెట్రోలియం జెల్లీ చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది కాబట్టి పొడి చర్మానికి చాలా మంచిది. కానీ ఇది చర్మ రంధ్రాలను అడ్డుకుంటుంది. వేడి, చెమట తప్పించుకోలేవు. ఇది ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

2. ఐస్ ప్యాక్‌లకు దూరంగా ఉండండి.

ఐస్ ప్యాక్‌లు తరచుగా చల్లబరచడానికి ఉపయోగిస్తారు. కానీ అవి తేమ ఏర్పడటాన్ని నిరోధించి, చర్మాన్ని పొడిగా చేస్తాయి. ఇది పొడిబారడం నొప్పిని పెంచుతుంది.

3. బొబ్బలు పాప్ చేయవద్దు..

వడదెబ్బ కారణంగా చర్మం మీద ఏర్పడిన బొబ్బలు పాప్ చేస్తే, అది నయం కావడం నెమ్మదిస్తుంది. చర్మాన్ని మరింత దెబ్బతీస్తుంది. మచ్చలు లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.

4. బిగుతుగా ఉండే బట్టలు ధరించవద్దు.

వేసవి ఎండలో చర్మానికి అంటుకునే దుస్తులను ధరించకుండా ఉండాలి. వడదెబ్బ తగిలిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న బట్టలు బాధాకరంగా ఉంటాయి, చర్మాన్ని చికాకు పెడతాయి. శరీరంలో వేడిని బంధిస్తాయి. అంతేకాకుండా, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి, ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి, వేసవి సమయంలో బిగుతుగా ఉండే లెదర్ ప్యాంట్‌లు, బాడీ హగ్గింగ్ దుస్తులకు దూరంగా ఉండటం మంచిది.

5. సన్బర్న్ చికిత్సకు చిట్కాలు

1. చల్లని వాతావరణంలో ఇంటి లోపల ఉండండి.

2. వడదెబ్బ వల్ల కలిగే నొప్పి నుండి కొంత ఉపశమనం పొందడానికి చల్లని స్నానం చేయండి.

3. బాత్రూమ్ నుండి బయటికి వచ్చిన వెంటనే, శరీరాన్ని ఆరనివ్వండి.

4. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పూయండి. ఇది చర్మం పొడిగా మారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

5. వడదెబ్బ తగిలిన చర్మానికి ఉపశమనం కలిగించేందుకు కలబంద ఉన్న మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి.

6. వడదెబ్బ తగిలినప్పు ఎక్కువ నీటిని తాగడం వల్ల, డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

Updated Date - 2023-05-11T12:53:40+05:30 IST