Long Hours Not Needed: ఇది తెలియక ఎక్కువ సేపు వాకింగ్ చేస్తుంటారు.. గుండె బాగుండాలన్నా, నాలుగు రోజులు ఎక్కువ బతకాలన్నా రోజుకు ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలో తెలుసా..?
ABN , First Publish Date - 2023-04-26T14:52:07+05:30 IST
వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం, డ్యాన్స్ చేయడం, బైక్ నడపడం, టెన్నిస్ ఆడటం, హైకింగ్ చేయడం సరిపోతుంది.
గుండె జబ్బులు, స్ట్రోక్ అనేక వ్యాధుల వల్ల కలిగే మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు కేవలం 11 నిమిషాలు అదే వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం, డ్యాన్స్ చేయడం, బైక్ నడపడం, టెన్నిస్ ఆడటం, హైకింగ్ చేయడం సరిపోతుంది. ఇలా అని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. సిఫార్సు చేయబడిన శారీరక శ్రమ వారానికి 150 నిమిషాలు. అయితే వారానికి 75 నిమిషాలు లేదా రోజుకు 11 నిమిషాల చొప్పున మితమైన వ్యాయామం చేయడం వల్ల 10 మంది ముందస్తు మరణాలలో ఒకరిని నిరోధించవచ్చని UKలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలోని బృందం తెలిపింది.
అంటే వారం రోజుల్లో కనీసం 75 నిమిషాలు వ్యాయామం ఉన్నాసరే అనారోగ్యాల భారిన పడే అవకాశం తగ్గుతుందట. మరి అలాంటి వ్యాయామం మనం చేయగలుగుతున్నామా?
వారానికి 150 నిమిషాల మితమైన తీవ్ర శారీరక శ్రమను చేయడం అవసరం. రోజులో ఏదీ చేయకపోవడం కంటే కొంత శారీరక శ్రమ చేయడం ఉత్తమం. ఇది కూడా మంచి ప్రారంభ స్థానం. వారానికి 75 నిమిషాలు నిర్వహించవచ్చని క్రమం తప్పకుండా చేయడం వల్ల అనారోగ్యం దరి చేరదని తేల్చింది. మరీ ఇబ్బంది లేకపోతే ఈ వ్యాయామాన్ని పెంచుకోవచ్చు. లేదా ఇబ్బంది ఉన్నట్టుగా అనిపిస్తే ఈ సమయాన్ని తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చదవండి:బెడ్‌పై రిలాక్స్ అవ్వడమే కాదు.. ఈ విషయం కూడా తెలియాలి.. లేకపోతే రోగాలను కొనితెచ్చుకున్నట్టే..!
హృదయ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. 2019లో సంవత్సరానికి 17.9 మిలియన్ల మరణాలకు కారణమైంది, అయితే 2017లో 9.6 మిలియన్ల మరణాలకు క్యాన్సర్‌లు కారణమయ్యాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, వారానికి 75 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17 శాతం, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 7 శాతం తగ్గించవచ్చుని తేల్చింది.
కొన్ని నిర్దిష్ట క్యాన్సర్‌లకు, రిస్క్‌లో తగ్గుదల ఎక్కువగా ఉంది. తల, మెడ, మైలోయిడ్ లుకేమియా, మైలోమా, గ్యాస్ట్రిక్ కార్డియా క్యాన్సర్‌లు 14 నుంచి 26 శాతం మధ్య తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి.
ఊపిరితిత్తులు, కాలేయం, ఎండోమెట్రియల్, పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లకు, 3 నుంచి 11 శాతం తక్కువ ప్రమాదం ఉన్నట్టు తేలింది. నడక, సైకిల్ తొక్కడం వంటి శారీరక శ్రమ ప్రత్యేకించి అది హృదయ స్పందన రేటును పెంచుతుందని తేల్చింది. గుండె ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రతిరోజూ 10 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేసి చక్కని ఫలితాలను పొందవచ్చు.