Health Tips: శరీరంలోకి చెడు కొవ్వు కరిగిపోవాలంటే.. రోజూ పొద్దున్నే పాలు తాగడానికి బదులుగా.. దీన్ని ట్రై చేయండి చాలు..!

ABN , First Publish Date - 2023-06-15T11:11:00+05:30 IST

ముఖ్యంగా లైఫ్ స్టైల్ బిజీ, వ్యాయామం చేయడానికి సమయం లేనప్పుడు బరువు తగ్గడం ఒక్కోసారి చాలా కష్టంగా అనిపిస్తుంది.

Health Tips: శరీరంలోకి చెడు కొవ్వు కరిగిపోవాలంటే.. రోజూ పొద్దున్నే పాలు తాగడానికి బదులుగా.. దీన్ని ట్రై చేయండి చాలు..!
weight loss,

బరువు అనుకోకుండా పెరిగిపోతాం. కానీ అదే తగ్గాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికోసం ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా తగ్గడం అంత త్వరగా జరిగే పనికాదు. కానీ ఒక్కసారి బరువు తగ్గాలని అనుకున్నాకా.. అనుకున్నదే తడవుగా బరువు తగ్గడం అటు శరీరానికి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

ముఖ్యంగా లైఫ్ స్టైల్ బిజీ, వ్యాయామం చేయడానికి సమయం లేనప్పుడు బరువు తగ్గడం ఒక్కోసారి చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే సమయంలో, ఆహారాన్ని ఒక్కసారిగా మార్చేయడం కూడా సులభం కాదు. మనం తీసుకునే రోజువారి ఆహారంలోనే చిన్న చిన్న మార్పులతో ఇది సాధ్యం చేసుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్‌ను, పెరుగుతున్న బరువును దాల్చిన చెక్కతో తయారు చేసిన టీని తాగుతూ తగ్గించుకోవచ్చు. అదేలాగంటే..

దాల్చిన చెక్క ఇది మసాలా దినుసుగా ఎక్కువగా వాడుతూ ఉంటాం, రక్తపోటును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. దాల్చిన చెక్క జీవక్రియను పెంచడంలో, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: మామిడి పండ్లను తింటే కొందరికి మొటిమలు రావడం వెనుక అసలు కారణం ఇదే.. తినేముందు ఈ 3 టిప్స్ ఫాలో అయితే..!

అంతే కాదు బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. దాల్చినచెక్కలో యాంటీమైక్రోబయల్, యాంటీపరాసిటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీని వాడటం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. అలాగే తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క టీలో తేనె కలుపుకుని తీసుకోవాలి. తేనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆకలిని తగ్గించే హార్మోన్లు కూడా ఉన్నాయి ఇవి బరువును తగ్గించడంలో సహాయపడుతాయి. తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. జీవక్రియ మెరుగు పడుతుంది. వరుసగా దాల్చిన చెక్క టీ తీసుకుంటే ఇది కొవ్వు బర్నింగ్‌లో సహాయపడుతుంది.

1. ఈ టీ చేయడానికి, ఒకటి నుండి ఒకటిన్నర కప్పు నీరు మరిగించండి.

2. దానికి అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి.

3. ఇప్పుడు ఈ నీటిలో తేనె వేసి బాగా కలపాలి.

4. బరువు తగ్గించే దాల్చిన చెక్క, తేనె టీ సిద్ధంగా ఉంది. రెగ్యులర్ మిల్క్ టీ స్థానంలో ఈ టీని తాగవచ్చు.

5. ఇది మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

Updated Date - 2023-06-15T11:11:00+05:30 IST