Eating Rice : ఏ రైస్ ఉత్తమమైనవి.. మీ ఆరోగ్యాన్ని బట్టి ఏ రకం రైస్ తినాలో తెలుసా..!
ABN , First Publish Date - 2023-04-27T16:45:07+05:30 IST
అంతేకాక, రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో చాలా రకాల ఉత్పత్తుల్ని, ఆహారపదార్థాలను ఆరోగ్యాన్ని ఇట్టే కాపాడేస్తాయనే విషయంగా పావులర్ చేసి మరీ చెబుతున్నారు. ఈ మాట పట్టుకుని కొందరు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారు. ఈ ఉత్పత్తుల వెనుక వెళుతున్నారు. అసలు ఏ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది. వీటిలో చాలా వరకు సాధారణంగా టీలు, కాఫీలు, చాక్లెట్‌లు ఉంటాయి, సరసమైన వాణిజ్య ధాన్యాలలో బియ్యం కూడా ఒకటి.
వరి అన్నం మన ప్రధాన ఆహార వనరు. అనేక సంస్కృతులలో బియ్యం, ధాన్యాలు ప్రధానమైనవి. బియ్యం నిజానికి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా వినియోగించబడే ఆహారం. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు బియ్యం ఉత్పత్తితో జీవిస్తున్నారు. ఈ చిన్న రైతులు తరచుగా తమ బియ్యం, ధాన్యాలను వారి ఉత్పత్తి ఖర్చుల కంటే చాలా తక్కువ ధరలకు విక్రయిస్తారు.
ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభా ప్రధాన ఆహారం బియ్యం. దీనితో కేవలం అన్నమే కాదు.. రకరకాల వంటకాలు చేసుకొని తినడం చాలా దేశాల్లో కామన్ . ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజల ఆహారంలో ఇవి భాగమయ్యాయి. దీని శాస్త్రీయ నామం ఒరైజా సటైవాగా పిలుస్తారు. అయితే, మార్కెట్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్, వైట్ రైస్ వంటి అనేక రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి.
అయితే, తెలుపు రంగులో ఉండే బియ్యం కంటే గోధుమ రంగులోని బియ్యం మంచివనే ప్రచారం ఉంది. ఇందులో నిజం లేదని, వాస్తవానికి బియ్యం ఏ రంగులో ఉన్నా అవి ఆరోగ్యానికి మంచివేనని నిపుణులు చెబుతున్నారు. రైస్‌తో ఎన్నో రకాల వంటలు చేసి ఆరగించడంతో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ చేసిన రైస్ కంటే ప్రాసెస్ చేయని రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.
అలసట ఎక్కువగా ఉంటే..
అలసట, ఆకలి తీవ్రంగా ఉన్న సందర్భంలో కొద్దిగా అన్నం తిన్నా తీసుకుంటే తక్షిణ శక్తి లభిస్తుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు శక్తిగా మారి మన శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడమే కాక, అలసట లేకుండా మెదడును సమర్థంగా పనిచేసేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: దగ్గుతో పడలేక కాఫ్ సిరప్‌లు తాగుతున్నారా..? దగ్గు మందుల గురించి తాజాగా తేలిందేంటంటే..
జీర్ణక్రియకు :
రైస్ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి, ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. దీన్ని అరిగించుకోవడం సులభం. తేలిగ్గా అరుగుతూ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. రైస్‌లో ఎక్కువగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని మలినాలను తొలగించడంతో పాటు డీహైడ్రేషన్‌ని కూడా నివారిస్తుంది.
ఊబకాయానికి చెక్:
అన్నం తింటే బరువు పెరుగుతారు అంటారు కానీ, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో రైస్ బాగా తోడ్పడుతుంది. ఇందులో తక్కువ స్థాయిలో ఉండే సోడియం, కొలెస్ట్రాల్ బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. అన్నం తగిన మోతాదులో తింటే అది బరువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. రైస్‌లో ఉండే ఫైబర్ ఒబెసిటీని నియంత్రిస్తుంది.
గుండెకు :
రైస్ వాడకం గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే వాపును నివారించే గుణాలతో పాటు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన గుండెకు రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతో మంచిది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. అంతేకాక, రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రక్తపోటు, మధుమేహం..
అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి రైస్ సరైన ఆహారం. రైస్ తీసుకోవడం ద్వారా రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఈ రెండూ జీవనశైలి వ్యాధులతో ఇబ్బందిపడేవారు ఒక బౌల్ రైస్‌తో వీటిని తేలిగ్గా దాటవచ్చట.