Constipation Problem: రోజూ పొద్దునే చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇదే.. రాత్రిళ్లు ఈ గింజలను కనుక ఇలా వాడితే..!
ABN , First Publish Date - 2023-07-14T16:22:18+05:30 IST
సబ్జా గింజలలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
రోజులో తీసుకునే ఆహారంతో శరీరానికి శక్తి వస్తుంది. దానితోనే ఆరోగ్యం కూడా అయితే శరీరం చేయాల్సిన పనులను సరైన రీతిలో చేయకపోయినా, ఆహారం తీసుకోవడంలో మార్పులు జరిగినా ఆ ప్రభావం జీర్ణక్రియమీద పడుతుంది. దీనికి ఉదయాన్నే మొదలయ్యే సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి. ఇది సాధారణ కడుపు సమస్యే అయినా రోజులో అశాంతితో పాటు, అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వీటిని ట్రై చేయండి. సబ్జా గింజలు, తులసి గింజలలో ఫైబర్ ఉంటుంది, ఇది ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. కడుపు క్లీన్ గా ఉంచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
1. దీనితో పాటు, బరువు తగ్గడానికి కూడా ఈ సబ్జా గింజలు సాయపడతాయి. శరీరం అలసిపోయినా సబ్జాగింజలు సహకరిస్తాయి.
2. మామూలుగా సబ్జా విత్తనాలను, ఫలూడా విత్తనాలు, తులసి గింజల్ని, తుక్మారియా విత్తనాలు అని కూడా పిలుస్తారు. ఇవి పోషకాహారానికి పవర్‌హౌస్., రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలతో నిండి ఉంటాయి.
3. పొట్ట సరిగా క్లీన్ అవ్వని సమస్య ఉన్నవారికి, రోజూ రాత్రిపూట ఈ గింజలు తింటే మరుసటి రోజు నుంచే ఫలితం కనిపిస్తుంది.
ఈ చిన్న విత్తనాలను తరచుగా చియా గింజలుగా తప్పుగా అనుకుంటూ ఉంటారు కానీ, తులసి గింజలు మన ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, శరీరాన్ని చల్లబరుస్తుంది, ఒత్తిడిని తగ్గించడం, మంటను తగ్గించడం, కొన్ని ఇన్ఫెక్షన్లను నివారించడం. మలబద్ధకం నుండి బయటపడటానికి, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, సబ్జా గింజలు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
1. సబ్జా గింజలు మలబద్ధకంలో ఉపశమనాన్ని అందిస్తాయి.
సబ్జా గింజలు శరీరానికి సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తాయి. ప్రేగు కదలికను ప్రోత్సహిస్తాయి. కొన్ని సబ్జా గింజలను ఒక గ్లాసు పాలలో కలిపి కొన్ని రోజుల పాటు పడుకునే ముందు త్రాగాలి. సబ్జా గింజల్లో ఉండే నూనెలు గ్యాస్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అవి ఫైబర్‌లో సమృద్ధిగా ఉంటాయి మలబద్ధకం, విరేచనాలలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
2. సబ్జా గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
సబ్జా గింజలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అవి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: చెడ్డ కలలు ఎందుకొస్తాయ్..? రాత్రిళ్లు పడుకోబోయే ముందు చేసే ఈ ఒక్క పని వల్లేనా..?
3. దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
సాధారణ జలుబు, దగ్గు, ఉబ్బసం చికిత్సకు శతాబ్దాలుగా తులసి గింజలు ఉపయోగించబడుతున్నాయి. ఈ వ్యాధుల చికిత్సకు ప్రయోజనకరమైన యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు విత్తనాలలో కనిపిస్తాయి.
4. సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
సబ్జా గింజలలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఒక గ్లాసు టోన్డ్ మిల్క్‌లో నానబెట్టిన విత్తనాలను కలపండి. దీన్ని రోజూ తాగడం వల్ల రోజంతా శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.