Yellow Teeth: ఎంత బ్రష్ చేసినా.. ఎన్ని మందులు వాడినా పళ్లు పచ్చగానే ఉంటున్నాయా..? రోజూ ఈ విత్తనాలను నోట్లో వేసుకుని నమిలితే..!

ABN , First Publish Date - 2023-07-01T14:57:40+05:30 IST

నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

Yellow Teeth: ఎంత బ్రష్ చేసినా.. ఎన్ని మందులు వాడినా పళ్లు పచ్చగానే ఉంటున్నాయా..? రోజూ ఈ విత్తనాలను నోట్లో వేసుకుని నమిలితే..!
soft toothbrush

మనమందరం దంతాలను శుభ్రం చేయడానికి ప్రతిరోజూ బ్రెష్ చేసుకుంటూ ఉంటాం. దీనికోసం మంచి ట్యూత్ పెస్ట్, బ్రెష్ ని ఉపయోగిస్తాం కానీ పళ్ళు పసుపుగా గారపట్టినట్టు ఉన్నవి తెలుపు రంగులోకి మారవు. పేస్ట్ ఎంత గొప్పదైనా కూడా దంతాల రంగులో మార్పు రాకపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ దంతాలు వజ్రంలా మెరిసిపోవాలని కోరుకుంటారు.

కాబట్టి దంతాలు ఎల్లప్పుడూ తెల్లగా, శుభ్రంగా కనిపించాలంటే ఏమి చేయాలి?

దంతాలు కాంతివంతంగా మారాలంటే... దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ బ్రష్ చేయడమే కాదు, కొన్ని ఉపాయాలు పాటించడం కూడా అవసరం. అలాగే, కాల్షియం అధికంగా ఉండే వాటిని తీసుకోవడం ద్వారా దంతాలను బలోపేతం చేయాలి. మన నోటిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని విత్తనాలను తీసుకోవచ్చు. నువ్వులు దంతాల ప్రకాశానికి, చిగుళ్ళ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బాగా నల్లగా వేపిన నువ్వులను ఉదయాన్నే నమలడం వల్ల దంతాలు బలపడతాయి. నమిలిన తర్వాత టూత్‌పేస్ట్ లేదా టూత్‌పౌడర్ వాడకుండా మృదువైన టూత్ బ్రష్‌తో దంతాలను తిరిగి బ్రష్ చేయాలి.

నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, అవి దంతాలు, చిగుళ్ళ చుట్టూ ఉన్న ఎముకలను సురక్షితంగా ఉంచుతాయి. దంతాల ఎనామెల్‌ను నిర్మించడంలో సహాయపడినట్టే, పసపు రంగును తొలగించడంలో కూడా సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: ఇది తెలియక ఎంత ఉల్లిపాయ పొట్టును చెత్తబుట్టలో పారేసి ఉంటారో.. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే బంగారంలాగా..!

కాల్చిన నువ్వులను తెల్లవారుజామున నమలడం వల్ల కాలేయం, కడుపు ఉత్తేజితం అవుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన దంతాలు, చిగుళ్ళకు మాత్రమే కాకుండా మన జీర్ణ, అవయవ, కణజాల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నువ్వులను ఆయుర్వేదంలో అద్భుతమైనవిగా పరిగణిస్తారు. ఎముకలు, దంతాలు, జుట్టును బలోపేతం చేయడంలో ఇవి సహాయకులుగా పనిచేస్తాయి. ఈ నువ్వులు మలబద్ధకం చికిత్సలో సహాయపడతాయి. దీనితో పాటు, దగ్గును తగ్గించడానికి కూడా సహకరిస్తుంది.

Updated Date - 2023-07-01T14:57:40+05:30 IST