Sunscreen : ఎండవేడికి చర్మం తట్టుకోలేదనిపిస్తే సన్‌స్క్రీన్ లోషన్ పూస్తారు.. కానీ ఇది మిగతావాటికి కూడా పనిచేస్తుందని తెలుసా..!
ABN , First Publish Date - 2023-04-19T15:54:33+05:30 IST
సన్ బర్న్స్ చర్మం సన్నగా, కాంతిలేకుండా మారడానికి కారణమవుతుంది.
సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడంతో పాటు, సన్‌స్క్రీన్ అనేక ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు సన్‌స్క్రీన్ లోషన్ కొని పెట్టుకుంటాం. అయితే, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ క్రమంతప్పకుండా వాడాలట. ఎందుకంటే సన్‌స్క్రీన్ సన్‌బర్న్ నుండి 100% రక్షణను అందించడమే కాకుండా, అనేక చర్మ సమస్యలతో పోరాడే సూపర్ హీరో అంటున్నారు చర్మ నిపుణులు.
హానికరమైన UV కిరణాల నుండి రక్షణనిస్తుంది.
ఓజోన్ పొర విధ్వంసం కారణంగా హానికరమైన కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. సూర్యరశ్మి నుండి తగినంత విటమిన్ డి పొందడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే నేరుగా సూర్యకిరణాలు చర్మానికి హానికలిగిస్తాయని భావిస్తే, సన్‌స్క్రీన్ పూయడంతోపాటు, ఉదయపు నీరెండలో కాసేపు కూర్చున్నా కూడా ఒంటికి డి విటమిన్ లభిస్తుంది.
అకాల వృద్ధాప్యం రాకుండా..
మనమందరం యవ్వనంగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉండే చర్మాన్ని కోరుకుంటాము. సన్‌స్క్రీన్ ఇది ముడతలు, ఫైన్ లైన్స్, సన్‌స్పాట్‌లు, హైపర్‌పిగ్మెంటేషన్, ఫోటోడ్యామేజ్, డ్రై స్కిన్ కనిపించకుండా కాపాడుతుంది, ఇవన్నీ వృద్ధాప్య ప్రారంభ సూచికలు.
ఇది కూడా చదవండి: చెమట బాగా పట్టే వారిలో ఈ సమస్య ఉంటే ఇలా చేయండి.. మళ్ళీ రిపీట్ కాదు..!
చర్మ క్యాన్సర్ ప్రమాదం
సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం సౌందర్య ప్రయోజనాల కోసం అయినప్పటికీ, రకాల చర్మ క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదం నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి, ఎటువంటి క్రీములూ వాడకపోవడమే మంచిది. అయితే ఎండ వేడి నుంచి మాత్రమే ఈ సన్‌స్క్రీన్ కాపాడుతుందని మాత్రమే నమ్మండి.
సన్ బర్న్స్ నివారిస్తుంది.
సన్ బర్న్స్ చర్మం సన్నగా, కాంతిలేకుండా మారడానికి కారణమవుతుంది. చర్మంపై పొట్టు, వాపు, ఎరుపు, దద్దుర్లు, దురద పెరిగితే మాత్రం సన్ స్క్రీన్ వాటికి చెక్ పెడుతుంది.
చర్మం ఆరోగ్యం
సన్‌స్క్రీన్ కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి ముఖ్యమైన చర్మ ప్రోటీన్‌లను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన, మృదువైన చర్మాన్ని ఇవ్వడానికి ఈ ప్రోటీన్లు చాలా అవసరం.