disciplinary issues: మొండిగా వ్యవహరించే మీ పిల్లలతో ఇలా మాత్రం ఉండకండే..!
ABN , First Publish Date - 2023-02-22T15:38:53+05:30 IST
ఇదంతా పిల్లలకు కొత్తగా వింతగా ఉన్నాసరే అది వారికి ముందు ముందు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
తల్లిదండ్రులే పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోగలరు. మరి అలాంటిది వాళ్ళు చిరాకు పెడుతున్నారని, విసిగిస్తున్నారని కోప్పడితే దానికి అర్థం లేదు. తల్లిదండ్రులను చూసే పిల్లలు చాలా విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. ఎదుగుతున్న మెదళ్ళలో మనం ఏం నింపితే అదే అద్దంలో కనిపించినట్టుగా ప్రతిబింబంలా దర్శనమిస్తుంది. పిల్లల మెదళ్ళలో గుర్తులు పడడం అనేది 18 నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య జరుగుతుందట. ఈ కాలంలోనే భావోద్వేగాలను నిర్వహించడం నేర్చుకుంటూ ఉంటారు. ఇది అప్పుడప్పుడు విసుగు, కోపం, కొట్టడం, కొరకడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో పిల్లల భావోద్వేగాలను సానుకూలంగా వ్యక్తీకరించేలా చేయగలిగేది తల్లిదండ్రులే.
పరిమితమైన భాషా నైపుణ్యాలతో పిల్లలు దూకుడుగా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రీ స్కూలింగ్ దశలో పిల్లల దూకుడు నియంత్రించడంలో తల్లిదండ్రులు విఫలం అవుతూనే ఉన్నారు. పిల్లలు చెప్పే ప్రతీదీ పెద్దలు వినడం, అనుభూతి చెందడం అనేవి చేయాలి., వారిపై సరైన శ్రద్ధతో ఉండాలి. లేకపోతే పిల్లవాడు దూకుడుగా మారడానికి దారి తీస్తుంది.
కొంతమంది పిల్లలకు వారి తల్లిదండ్రుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల అన్నింటికీ అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఏ పని చేయద్దన్నా కూడా వారిలో ఒక రకమైన ధ్వేషం మొదలవుతుంది. ఎదిరించడం, విసుక్కోవడం, విసురుగా ఉండటం చేస్తూ ఉంటారు. క్రమంలో ఈ పద్దతివల్ల ఆరోగ్యకరమైన రీతిలో తమ భావాలను వ్యక్తీకరించడంలో లోపంగా మారుతుంది. పిల్లల మనస్తత్వ శాస్త్రాన్ని తల్లిదండ్రులకు అర్థం చేసుకోవడంలో, పసిపిల్లల మనస్సును మౌల్డ్ చేయడంలో ప్రీస్కూల్‌లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. పిల్లలతో పెద్దలు స్నేహంగా ఉన్నప్పుడే ఈ పరిస్థితి తగ్గుముఖం పడుతుంది.
దూకుడుగా ఉండే పిల్లలతో ఎలా వ్యవహరించాలి..
1. ఉపాధ్యాయులు పిల్లల దూకుడుకు ముందు, సమయంలో తర్వాత జరిగిన సంఘటనలను గమనించాలి. దానిని ఎందుకు ఆ అల్లరి పని చేయాల్సి వచ్చిందో అంచనాకు వచ్చిన తరువాత మాత్రమే పిల్లల్ని వాదనలోకి దింపాలి తప్పితే ముందుగానే తప్పు పట్టకూడదు.
2. ఎదుటివారిని మర్యాదగా పలకరించడం, ఇంట్లో పనులను పంచుకోవడం, తమపనులు తాము చేసుకోవడం వంటివి చాలా అవసరం. పిల్లలు ఈ పనులు చేయకపోతే వారి పట్ల ఓపికగా, దృఢంగా, సూటిగా, స్థిరంగా ఉండండి. ప్రీస్కూలర్లు సమయంలో వారి భావోద్వేగాలు, సంబంధాలను ఎలా నిర్వహించాలో వారే నేర్చుకుంటారు.
3. ప్రతికూల భాషతో వాళ్ళమీద అరవకుండా పిల్లల ప్రేమను సంపాదించే విధంగా వాళ్లకు అర్థమయ్యే విధంగా విషయాన్ని వివరించండి. ఇది మిమ్మల్ని శత్రువుల్ని చేయకుండా చేస్తుంది.
4. పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండండి. పరిష్కారం, కమ్యూనికేషన్ ఏదైనా పిల్లల సానుకూల సామాజిక నైపుణ్యాల అభివృద్ధికి కీలకమైన అంశాలు.
5. ఆమోదయోగ్యమైన, ఆమోదయోగ్యం కాని ప్రవర్తన గురించి తరచుగా మాట్లాడుతూ ఉండండి. ఇది వారి భవిష్యత్ కాలంలో ఉపయోగపడుతుంది.
6. నియమాలు, పరిమితులు స్పష్టంగా తెలియజేయడం వల్ల ముఖ్యమైన విషయాల్లో పరిథుల్లో ఉంటారు. కాస్త కఠినంగా ఉన్నాకూడా ఇది ముందు ముందు ఉపయోగపడుతుంది.
పిల్లల పెరుగుదలలో భాగంగా వారితో స్నహంగా ఉండటం కూడా చాలా అవసరం. మనసులోని దిగుళ్లను, భయాలను మీతో పంచుకునే విధంగా వారితో చిట్టి స్నేహాన్ని ఏర్పరుచుకోండి. ఇదంతా పిల్లలకు కొత్తగా వింతగా ఉన్నాసరే అది వారికి ముందు ముందు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొండి తనం లేకుండా సానుకూలంగా వ్యవహరించే సత్తాను ఇస్తుంది. మరీ కఠినంగా ఉండకుండా స్వేచ్ఛగా విహరించేలా చేయడంలో తల్లిదండ్రులే గురువులు కావాలి. చదువుల భారం నుంచి పెద్దలే సేదతీర్చాలి.