Health Tips: రాత్రిళ్లు వీటిని తినడం మానేయండి.. ఇష్టం కదా అని ఈ ఐదింటిని తింటే జరిగేది ఇదే..!

ABN , First Publish Date - 2023-08-19T11:17:27+05:30 IST

రాత్రిపూట రుచికరమైన ఆహారం తినాలని కోరిక కలగగానే పిజ్జా తినేస్తూ ఉంటారు. అయితే పిజ్జా ఎసిడిటీ రావడానికి కారణం అవుతుంది.

Health Tips: రాత్రిళ్లు వీటిని తినడం మానేయండి.. ఇష్టం కదా అని ఈ ఐదింటిని తింటే జరిగేది ఇదే..!
Stomach Problems

రాత్రి భోజనం తేలికగా తింటే జీర్ణవ్యవస్థ మీద పెద్ద భారం పడుదు. దీంతో ఆరోగ్యం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బావుంటుంది. అయితే రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో చిన్న చిన్న తప్పులను చేయడం వల్ల అది ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. అందులో ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ తల్లకిందులవుతుంది. రాత్రిళ్ళు తినకూడని కొన్ని పదార్థాలను గురించి చెప్పుకోవలసి వస్తే.. త్వరగా జీర్ణంకాని ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా రాత్రి ఏదైనా చెడు తిన్న తర్వాత నిద్రపోతే, అప్పుడు అసిడిటీ ఏర్పడుతుంది, దీని కారణంగా రాత్రి నిద్ర ఎగిరిపోతుంది. మరుసటి రోజు కూడా రిలాక్స్‌గా అనిపించదు. ఇటువంటి పరిస్థితిలో, రాత్రిపూట ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. రాత్రిపూట కొన్ని ఆహారాలు తినడం మానుకోవాలి. రాత్రిపూట తినకూడని కొన్ని ఆహారాలు ఏంటంటే..

వేయించిన పదార్థాలు..

రాత్రిపూట వేయించిన పకోడీలను తినడం మానుకోండి. ఈ పకోడీల్లో నూనె మాత్రమే కాకుండా ఆమ్లత్వం కూడా ఉంటుంది, దీని వల్ల అసిడిటీ వస్తుంది. వాటిని జీర్ణం చేసుకోవడం కూడా కష్టం. అందుకే రాత్రి పూట వేయించిన వాటికి దూరంగా ఉండటం మంచిది.

పుల్లని పండ్లు..

నారింజ, నిమ్మ, బెర్రీలు, టమోటో వంటి సిట్రస్ పండ్లను రాత్రిపూట తింటే అసిడిటీ వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ఖాళీ కడుపుతో తినడం మానుకోవాలి. ఇది కాకుండా, ఈ పదార్థాలు రాత్రిపూట గుండెల్లో మంటను కూడా కలిగిస్తాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో కుక్కర్‌తో ఇలాంటి సమస్య ఎప్పుడైనా వచ్చిందా..? విజిల్స్ అస్సలు రాకుండానే..!


చాక్లెట్

ఆహారం తిన్న తర్వాత, తీపి తినాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో చాక్లెట్ తింటూ ఉంటారు. రాత్రిపూట చాక్లెట్ తింటే, యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. చాక్లెట్‌లు ఎక్కువగా తింటే ఎసిడిటీ, కడుపునొప్పి సమస్య కనిపిస్తుంది.

పిజ్జా

రాత్రిపూట రుచికరమైన ఆహారం తినాలని కోరిక కలగగానే పిజ్జా తినేస్తూ ఉంటారు. అయితే పిజ్జా ఎసిడిటీ రావడానికి కారణం అవుతుంది. ఇదే కాకుండా జున్ను కొవ్వు, టమోటా కెచప్ నిద్రను పాడు చేస్తాయి.

కెఫిన్

రాత్రిపూట కెఫీన్ అంటే కాఫీ లేదా టీ తక్కువగా తీసుకుంటే మంచిది. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుచేత రాత్రి సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

Updated Date - 2023-08-19T11:17:27+05:30 IST