Hair: ఈ టెక్నిక్‌ను ఎప్పుడూ విని ఉండరు.. షాంపూలో ఈ రెండిటినీ కలిపి తలస్నానం చేస్తే..!
ABN , First Publish Date - 2023-07-08T13:09:08+05:30 IST
తేనె, పెరుగు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది.
మారుతున్న వాతావరణం ప్రభావం జుట్టుపై కూడా కనిపిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైంది. రోజురోజుకు వర్షం, సూర్యకాంతి రెండూ జుట్టును ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో ఉండే తేమ వెంట్రుకలను ప్రభావితం చేస్తుంది. ఆధునిక జీవన శైలిలో కలుషిత ఆహారం, పొల్యూషన్ వల్ల జుట్టు మొత్తం నిర్జీవంగా మారుతోంది. మార్కెట్లో లభించే ఎన్ని బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడినా, ఎటువంటి ఫలితం ఉండటం లేదు. జుట్టు మొత్తం సహజ గుణాలను కోల్పోయి అంద విహీనంగా తయారవుతుంది. జుట్టుకు పోయిన మెరుపుని మళ్లీ తీసుకురావొచ్చు. కానీ అది మార్కెట్‌లో లభించే ప్రొడాక్ట్స్ వల్ల మాత్రం కాదు. ఇంట్లోనే సహజసిద్దమైన పదార్థాలతో జుట్టుని అందంగా తయారుచేసుకోవచ్చు.
మరీ తడిచినా అది జుట్టు చిట్లేలా చేస్తుంది. ఈ జుట్టు సమస్యను వదిలించుకోవడానికి, అద్భుతమైన షాంపూ హ్యాక్‌ని ప్రయత్నించవచ్చు. షాంపూతో చిట్లిన జుట్టు సమస్య నుండి బయటపడటానికి, జుట్టును మృదువుగా చేయడానికి, దీనిని ప్రయత్నించండి.
ఇది కూడా చదవండి: వంటింట్లో డబ్బాల్లో కనిపించే లవంగాలు.. అలా తయారవడానికి ఎంత శ్రమ దాగి ఉందో తెలిస్తే..!
1. జుట్టును మృదువుగా చేయడంలో కొన్ని ఇతర చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయి. పావు కప్పు కలబంద గుజ్జు, బాదం నూనెను కలపండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచిన తర్వాత తలను కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, అందంగా కనిపిస్తుంది.
2. తేనె, పెరుగు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. దీని కోసం, ఒక గిన్నెలో 2 చెంచాల పెరుగు, ఒక చెంచా తేనె కలపండి. అరగంట పాటు జుట్టుకు పట్టించిన తర్వాత కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. ఇవి జుట్టుకు అప్లేయ్ చేసిన తరువాత షాంపూ చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా, మృధువుగా ఉంటాయి.