Coconut oil vs Olive oil: కొబ్బరి నూనె మంచిదా..? ఆలివ్ ఆయిల్ వాడటం మంచిదా..? రెండిటిలోనూ ఏది బెస్ట్ అంటే..!

ABN , First Publish Date - 2023-06-28T12:21:07+05:30 IST

వండడానికి ఉపయోగించే నూనెకు కూడా ప్రాముఖ్యత ఉందని గుర్తించడం ముఖ్యం.

Coconut oil vs Olive oil: కొబ్బరి నూనె మంచిదా..? ఆలివ్ ఆయిల్ వాడటం మంచిదా..? రెండిటిలోనూ ఏది బెస్ట్ అంటే..!
Olive oil, coconut oil

ఆహార పదార్థాలను తయారు చేయడంలో ఇందుకు వాడే వస్తువుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వంట నూనె విషయానికి వచ్చే సరికి, మామూలు నూనెలే వాడేస్తూ ఉంటాం. ఇలా వాడటం నిజానికి మిగతా విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్నే చూపిస్తాయట. ఈ విషయంగా చాలా మంది నిశ్చల జీవనశైలికి దూరంగా, ఫిట్‌నెస్ వైపు మళ్లుతున్నారు. ఆరోగ్యం, పోషకాహారం విషయానికి వస్తే తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ చూపుతున్నప్పటికీ, వండడానికి ఉపయోగించే నూనెకు కూడా ప్రాముఖ్యత ఉందని గుర్తించడం ముఖ్యం.

మార్కెట్లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నప్పటికీ, గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు సరైన రకాన్ని ఎంచుకోవడం అవసరం. కొబ్బరి నూనె (Coconut oil), ఆలివ్ నూనె (Olive oil) అన్నింటికంటే ఆరోగ్యకరమైన నూనెలుగా అగ్రస్థానంలో ఉన్నాయి. పూర్వం నువ్వుల నూనెతో, ఆవ నూనెతోనే వంటలు ఎక్కువగా చేసేవారు.

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె ఏది మంచిది?

కొబ్బరి నూనె ఎక్కువగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (Medium chain triglycerides) అని పిలువబడే అణువుల రూపంలో సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది, ఇది శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరోవైపు, ఆలివ్ నూనెతో పోలిస్తే కొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ (Smoking point)ఎక్కువ. కొబ్బరి నూనెను 350 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు వేడి చేయవచ్చు, ఇది మధ్యస్తంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి బావుంటుంది.

లారిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో కనిపించే కొవ్వు ఆమ్లం, ఇది దాదాపు సగం MCTలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ (Anti bacterial) గుణాలు ఉన్నాయి, ఇది వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడుతుంది. అందువలన, లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాను ప్రభావవంతంగా నాశనం చేయగలదు.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా ఈ ఐదింటినీ పచ్చిగా ఉన్నప్పుడే తినకండి.. తెలియక తింటే జరిగేది ఇదే..!

ఆలివ్ ఆయిల్ LDL (చెడు కొలెస్ట్రాల్)ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వంట నూనెలలో ఒకటిగా స్థిరంగా నిరూపించబడింది. ఆలివ్ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ (Monounsaturated) కొవ్వులు, LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి మెరుగైన రోగనిరోధక శక్తి కోసం విటమిన్ E అదనపు ప్రయోజనాన్ని మెరుగైన ఎముక సాంద్రత, ఆరోగ్యానికి విటమిన్ K తో పాటు కణజాల మరమ్మత్తును చేస్తాయి. అలాగే, ఆలివ్ ఆయిల్ స్మోకింగ్ పాయింట్ 280 డిగ్రీల ఫారెన్‌హీట్ దానిని దాటి అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయకూడదు.

Updated Date - 2023-06-28T12:21:07+05:30 IST