Viral: ఎర్రగా కనిపించే ఈ పురుగులను ఎప్పుడైనా చూశారా..? వర్షాకాలంలోనే ఇవి ఎందుకు కనిపిస్తాయంటే..!

ABN , First Publish Date - 2023-07-25T15:31:51+05:30 IST

వ‌ర్షం ప‌డ‌గానే ఈ పురుగులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఆరుద్ర పురుగుల‌పై కొన్ని సామెత‌లు కూడా పూర్వ‌పు రోజులల్లో వాడుక‌లో ఉండేవి.

Viral: ఎర్రగా కనిపించే ఈ పురుగులను ఎప్పుడైనా చూశారా..? వర్షాకాలంలోనే ఇవి ఎందుకు కనిపిస్తాయంటే..!
Arudhra

ప్రకృతిలో ప్రతిదానికీ ఓ లెక్క ఉంది. ఏ కాలానికి ఆ విధమైన వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి అనుగుణంగానే పశుపక్షాదులు అన్నీ ప్రవర్తిస్తాయి. ఎక్కడో భూమిలో దాగి ఉండే చిన్నసైజు జీవులు వాటికి ఎలా తెలుస్తుందో ఏమో.. వానాకాలం వస్తుందని ఒక్కసారిగా మేలుకొని భూమిపైకి వచ్చేస్తాయి. వాటి రాక ఎవరికీ ఆనందం కాకపోయినా, తెలియకపోయినా ఆ జీవులు భూమి మీదకు వచ్చాయంటే వర్షాలు దండీగా కురుస్తాయనే ఆనందం ఒక్క రైతన్నలో మాత్రం మెండుగా ఉంటుంది. ఇక ఆ జీవుల పేరు ఆరుద్ర పురుగులు. అవి ఎర్రగా పండిన దొండపండులా ఉంటాయి. ఆ ఎరుపు వాటికే ప్రత్యేకం అన్నట్టు ఉంటుంది.

రైతులు దుక్కులు దున్నాక.. తొలకరి జల్లులు పడగానే.. ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎర్రటి నూగుతో ఈ పురుగులు చెట్ల మొదళ్ళలో., నేల ఒంపుల్లో పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఆరుద్ర కార్తిలో ఈ పురుగులు తారసపడుతూ ఉంటాయి. గతంలో ఎక్కువగా కనిపించేవి కానీ.. ఇప్పుడు క్రిమి సంహారక మందుల పిచాకారీ., రసాయన ఎరువుల వినియోగం పెరుగుతుండటంతో చాలావరకూ తగ్గాయి. పెరుగుతున్న కాలుష్యం వీటి ఉనికికి కూడా ప్రమాదాన్ని తెచ్చుపెడుతుంది. ఎప్పుడూ భూమి లోపల నివాసం ఉండే ఈ పురుగులు.. తొలకరి వానలు పడ్డప్పుడు మాత్రమే బయటకు వచ్చి కనువిందు చేస్తాయి.

కొన్ని ప్రాంతాల‌లో వీటిని ల‌క్ష్మీ దేవిగా భావించి పూజిస్తారు. ఇవి ఎర్రగా అందంగా ఉంటాయి. పంటలకు వీటితో ఎలాంటి హానీ ఉండదు. ఈ పురుగుల్ని చూడడం ఏడాదంతా మంచిజరుగుతుందని నమ్ముతారు. ఈ పురుగులు నేలను గుల్లగా మార్చి మొక్కలు నేలలోని పోషకాలను తీసుకునేలా చేస్తాయి. భూ సారాన్ని పెంచుతాయి. ముట్టుకుంటే ముడుచుకుపోతాయి. ఎర్రని ఎరుపు రంగులో ముట్టుకుంటే వాటి రంగు అంటుకుంటుంది.

ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోతోందా..? ఈ 5 అంశాలే అసలు కారణాలు.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..!


వీటిని వ‌రుణ దేవుడికి ప్ర‌తి రూపంగా చాలా మంది భావిస్తారు. ఈ ఆరుద్ర పురుగులు భూమిలో 40 అడుగుల లోతు వ‌ర‌కు నివ‌సిస్తాయి. ఈ పురుగులు భూమి లోప‌ల ఎక్కువ‌ కాలం నివ‌సిస్తాయి. వ‌ర్షం ప‌డ‌గానే ఈ పురుగులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఆరుద్ర పురుగుల‌పై కొన్ని సామెత‌లు కూడా పూర్వ‌పు రోజులల్లో వాడుక‌లో ఉండేవి. ఈ పురుగుల నుండి తీసిన నూనెను కొన్ని ప్రాంతాల‌లో ప‌క్ష‌వాతానికి ఔష‌ధంగా, పురుషుల‌ల్లో లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచే ఔష‌ధంగా వాడ‌తారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ పురుగులు అంత‌రించే ద‌శ‌కు వ‌చ్చాయి.

Updated Date - 2023-07-25T15:34:27+05:30 IST