Ghee: నెయ్యిని ముఖానికి రాసుకోవడమేంటి బాబోయ్.. అని అవాక్కవుతున్నారా..? అలా చేస్తే జరిగేదేంటో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-07-10T15:52:47+05:30 IST
ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవచ్చు.
వేడి వేడి అన్నంలో కాచిన నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి మరి దేనికీ ఉండదు. నెయ్యితో చేసే స్వీట్స్ వంటకాలు మనకు ఎప్పుడూ అలవాటే.. ఇక అందాన్ని పెంచుకునే విషయానికి వస్తే పాలు, వెన్నను మాత్రమే అందాన్ని పెంచే సౌందర్య పోషకాలుగా వాడుతుంటాము. కానీ ఇవే కాకుండా గట్టిగా పేరుకున్న నెయ్యిని కూడా సౌందర్య పోషణలో ఉపయోగించవచ్చట. మామూలుగా నెయ్యి పేరుకున్నాకా గడ్డలా మారుతుంది. నెయ్యిని క్లారిఫైయింగ్ బటర్ అని కూడా అంటారు. దేశీ ప్రజలు చాలా ప్రత్యేకమైన దేశీ నెయ్యిని బ్రెడ్, కూరగాయలు, పప్పులు, అనేక ఇతర వంటలలో వేసి తింటారు.
నెయ్యి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా తినాలి, అయితే చర్మంపై నెయ్యిని అప్లై చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించి ఉండరు. కదా.. నిజానికి, నెయ్యి చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనితో, చర్మానికి విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి, ఇవి ముఖానికి అవసరమైన తేమను అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. నెయ్యి ప్రయోజనాలను పరిశీలిస్తే, దీనిని వివిధ మార్గాల్లో ముఖంపై అప్లై చేయవచ్చు.
ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.
ముఖంపై నెయ్యిని అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలను తొలగించడంలో ప్రభావాన్ని చూపుతుంది. మొటిమలు, పొడి చర్మం, పిగ్మెంటేషన్ , ముడతలు తొలగించడానికి కూడా నెయ్యి ముఖానికి రాసుకోవచ్చు.
నెయ్యి, శనగ పిండి
పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి, మచ్చలను తేలికపరచడానికి నెయ్యి ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, ఒక గిన్నెలో శెనగపిండి, నెయ్యి, పసుపు, నిమ్మరసం కలిపి పేస్ట్‌ను సిద్ధం చేసి, ముఖానికి అప్లైయ్ చేసి,. ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినట్టే లెక్క.. అదే జరిగితే..!
నెయ్యి, కుంకుమపువ్వు
యాంటీ ఏజింగ్ గుణాలు పొందడానికి, ముఖం కాంతివంతంగా ఉండాలంటే నెయ్యి, కుంకుమపువ్వు కలిపి రాసుకోవాలి. దీన్ని ఉపయోగించడానికి, అరచేతిలో కొంత నెయ్యి తీసుకుని, అందులో చిటికెడు పసుపు కలపండి. దీన్ని ముఖానికి రాసుకుని కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవాలి. దీన్ని గొంతు , మెడపై పూయడం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది.
నెయ్యి, పాలు
నెయ్యి ఈ ఫేస్ మాస్క్ ముఖాన్ని కాంతివంతం చేస్తుంది, మచ్చలను తీసివేస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌ను తయారు చేయడం కూడా చాలా సులభం. శెనగపిండిలో పాలు, నెయ్యి కలిపి ముఖానికి రాసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవచ్చు.
నెయ్యి, నీరు
నెయ్యిలో కొన్ని చుక్కల నీళ్లు కలిపి ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత ముఖం కడుక్కోవాలి. మొటిమలు, మరకలు, చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో నెయ్యి ప్రభావంతంగా పనిచేస్తుంది.