Hair Care Tips: జుట్టు బాగా పెరగాలని కొబ్బరి నూనెకు బదులుగా ఈ ఆయిల్ రాస్తున్నారా..? ముందు ఇవి తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2023-08-24T13:03:35+05:30 IST

ఈ ఆయిల్‌ను జుట్టుకు ఎక్కువగా రాయకూడదని గుర్తుంచుకోవాలి. దానిలో కొన్ని చుక్కలు మాత్రమే ఒకసారి వాడటానికి సరిపోతుంది.

Hair Care Tips: జుట్టు బాగా పెరగాలని కొబ్బరి నూనెకు బదులుగా ఈ ఆయిల్ రాస్తున్నారా..? ముందు ఇవి తెలుసుకోండి..!
hair fall

కాలుష్యం కారణంగా, సరైన జీవనశైలి అలవాట్లు లేని విషయంగా చాలామందిలో కనిపించే సమస్య జుట్టురాలే సమస్య. ఈ జుట్టు రాలే సమస్యను ఆపడానికి, అలాగే జుట్టు పెరిగేందుకు హోం రెమెడీస్ వాడుతున్నారు. పొడవాటి జుట్టుకోసం ఆడవారు, రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. ఈ నూనెల్లో రోజ్మెరీ ఆయిల్ గురించి కూడా కాస్త తెలుసుకుందాం. రోజ్మెరీ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షమాలను కలిగి ఉంది. రోజ్మేరీ ఆయిల్ గురించి చెప్పాలంటే..

జుట్టు పెరుగుదలకు రోజ్మేరీ ఆయిల్

రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం, స్కాల్ప్ సమస్యలు కూడా దూరమవుతాయి. దీని వల్ల చుండ్రు పోతుంది. తలపై దురద ఉండదు. రోజ్‌మేరీ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి.

ఈ ఆయిల్‌ను జుట్టుకు అప్లై చేయడానికి, దానిని కొన్ని ఇతర నూనెలతో కరిగించాలి. ఈ రెండవ నూనెను క్యారియర్ ఆయిల్ అంటారు. కొబ్బరి నూనె, జోజోబా నూనెలో కొన్ని చుక్కల రోజ్మేరీ ఆయిల్ కలపండి. జుట్టుకు రాసి, కొంత సమయం ఉంచిన తర్వాత, కడగాలి.

రోజ్మేరీ ఆకులను జుట్టుకు రాయవచ్చు. దీని కోసం, ఒక కప్పు రోజ్మేరీ ఆకులను నీటిలో ఉడకబెట్టాలి. చల్లబరచడానికి నీటిని పక్కన ఉంచి, ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టుపై చల్లుతూ..ఈ వాటర్‌ను కాటన్‌తో జుట్టుకు పట్టించి కొంత సమయం పాటు ఉంచి, ఈ నీటితో తల స్నానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది.

ఇది కూడా చదవండి: మీ పిల్లలు తెలివైన వాళ్లా..? కాదా..? ఈ 7 లక్షణాలతో ఈజీగా తెలుసుకోవచ్చు..!


ఈ నూనెను రాసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

1. రోజ్‌మేరీ ఆయిల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ఈ ఆయిల్‌ను జుట్టుకు ఎక్కువగా రాయకూడదని గుర్తుంచుకోవాలి. దానిలో కొన్ని చుక్కలు మాత్రమే ఒకసారి వాడటానికి సరిపోతుంది.

2. రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఉపయోగించినప్పుడు, దానిని పలుచన చేయడం మర్చిపోకూడదు. రోజ్‌మేరీ ఆయిల్‌ను వేరే నూనెలో కలపకుండా, పలుచన చేయకుండా అప్లై చేయవద్దు.

3. రోజ్‌మేరీ ఆయిల్‌ను తలపై అప్లై చేసే ముందు, చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాచ్ టెస్ట్‌తో ఏదైనా సమస్య ఉంటే, రోజ్‌మేరీ ఆయిల్‌ని ఉపయోగించవద్దు. సమస్య లేకుంటే నిస్సంకోచంగా జుట్టుకు రాసుకోవచ్చు. దీనితో జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

Updated Date - 2023-08-24T13:03:35+05:30 IST