Right Sleep: వేసవి చికాకుతో నిద్ర సరిగా పట్టడం లేదా? అయితే ఇలా చేసి చూడండి..!
ABN , First Publish Date - 2023-05-15T13:15:24+05:30 IST
వేసవిలో నిద్రాచక్రాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు తప్పనిసరి. హార్మోన్ సెరోటోనిన్ పగటిపూట మనల్ని శక్తితో నింపుతుంది
వేసవి మొదలైందంటే చికాకులు మొదలైనట్టే.. బయట ఎండతో వేడితో ఉదయం అంతా సతమతం అవుతూనే రాత్రికి నిద్రను కూడా పోగొట్టుకుంటాం. దీనికి వాతావరణం ఉక్కగా ఉండటమే కాదు. చెమటతో చికాకును కూడా తెస్తుంది. అయితే వేసవి కాలం నిద్రాభంగానికి సరైన విరుగుడు ఏమైనా ఉందా అని అన్వేషించి తెలుసుకోవాలి. వేసవిలో నిద్రాచక్రాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు తప్పనిసరి. హార్మోన్ సెరోటోనిన్ పగటిపూట మనల్ని శక్తితో నింపుతుంది, అయితే వేడి నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ రోజుల్లో నిద్రపోవడానికి కష్టపడుతున్న వారు, దానికి కారణమేమిటో నిద్ర చక్రాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో చూద్దాం.
వేసవిలో నిద్ర సమస్యలు..
ఆరోగ్యంగా ఉండటానికి అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచడానికి, నిద్ర అవసరం. కానీ ఎంతసేపు నిద్రపోవాలనే దానిమీద సరైన అవగాహన అవసరం. దీనికి ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎలా నిద్రపోతున్నారు అనేది కూడా ముఖ్యం. పగటి వేళలు ఎక్కువ అవుతున్నందున, శీతాకాలంలో కంటే వేసవిలో మెలటోనిన్ స్రావం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువగా నిద్రపోతాము.
మెలటోనిన్ అనేది శరీరం నిద్ర చక్రాన్ని నియంత్రించే సహజ పదార్ధం సూర్యకాంతితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, మెలటోనిన్ స్రావం ఆగిపోతుంది, తద్వారా శరీరం సిద్ధంగా ఉంటుంది. వేసవిలో పగటిపూట ఎక్కువ సమయం ఉండటం వల్ల, మెలటోనిన్ స్రవించే సమయం శీతాకాలంలో కంటే తక్కువగా ఉంటుంది. ఇది వేసవి నిద్రకు అంతరాయం కలిగించడానికి ప్రధాన కారకంగా ఉండవచ్చు, ఒత్తిడి, జీవనశైలి మార్పులు కూడా మన నిద్ర చక్రంపై ప్రభావం చూపుతాయి. నిద్ర చక్రాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి, ఏవైనా అంతర్లీన సమస్యలను గుర్తించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, ఈ చిట్కాలను అనుసరించడం.
నిద్ర చక్రం మెరుగుపరచడానికి చిట్కాలు..
1. సరైన నిద్ర వాతావరణాన్ని సెట్ చేయండి.
నిద్రను మెరుగుపరచడానికి, గది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడం మంచిది. ఫ్యాన్లు, కిటికీలు లేదా ఎయిర్ కండీషనర్‌ని ఉపయోగించడం ద్వారా తగినంత గాలిని పొందండి. పడుకునే ముందు వెంటనే ఏ రకమైన స్క్రీన్‌లను ఉపయోగించకుండా చూసుకోండి. అలాగే, విశ్రాంతి వాతావరణాన్ని సృష్టించడానికి నిద్రవేళకు ముందు డిమ్ లైట్లు వాడటం మంచిది.
2. కెఫిన్ వాడకాన్ని తగ్గించండి..
కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది, అలాగే రోజువారి పనితీరుకు దారి తీస్తుంది, ఇది మన నిద్ర చక్రంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి, ముఖ్యంగా నిద్రవేళకు ముందు కెఫిన్ వినియోగాన్ని తగ్గించడం చాలా మంచిది. బదులుగా, ఒక కప్పు వెచ్చని పాలు త్రాగాలి. రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడంలో ఇది అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే పాలలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను మెరుగుపరుస్తుంది.
3. స్థిరమైన నిద్ర
స్థిరమైన నిద్ర షెడ్యూల్ అంటే సరైన సమయానికి నిద్రపోవడం, నిర్ణీత సమయంలో లేవడం, ఇది మీ సర్కాడియన్ గడియారం నిద్రవేళకు సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది. సిర్కాడియన్ గడియారం లేదా రిథమ్ అనేది మన శరీరం అంతర్గత గడియారంలోని 24 గంటల చక్రం, చురుకుదనం పెరిగి, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: వేసవిలో చర్మాన్ని ఇలా రక్షించుకోండిలా..
4. పడుకునే ముందు స్నానం చేయండి.
నిద్రపోయే ముందు వేడి నీటి స్నానం చేయడం మంచి రాత్రి నిద్రను పొందే మార్గాలలో ఒకటి. యూరోపియన్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ అండ్ ఆక్యుపేషనల్ ఫిజియాలజీ నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందని తేల్చింది, ముఖ్యంగా వృద్ధులలో. వేసవిలో నిద్రపోవడంలో ఇబ్బందులు ఉంటే వేడినీటి స్నానం సహాయపడుతుంది.
5. స్లీప్ సప్లిమెంట్స్..
నిద్ర పోవడానికి సహకరించే మెలటోనిన్, చమోమిలే, లావెండర్ వంటి ప్రముఖ పదార్ధాలతో అనేక సప్లిమెంట్‌లు ఉన్నాయి. ఈ స్లీప్ ఎయిడ్ సప్లిమెంట్‌లు ఇవి వేగంగా నిద్రపోవడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన నిద్ర.. మరుసటి రోజు మగతను కలిగించకుండా ఉంటాయి.