Health Tips: ఫాస్ట్‌ఫుడ్ అలవాటుందా..? స్పైసీగా ఉంటాయని తెగ లాగించేస్తుంటారా..? పిజ్జాలు, బర్గర్లు కూడా తినే అలవాటుంటే..!

ABN , First Publish Date - 2023-06-17T13:00:35+05:30 IST

సరైన జీవనశైలి లేకపోవడం వల్ల గుండెపోటు వ్యాధి విస్తరిస్తోంది.

Health Tips: ఫాస్ట్‌ఫుడ్ అలవాటుందా..? స్పైసీగా ఉంటాయని తెగ లాగించేస్తుంటారా..? పిజ్జాలు, బర్గర్లు కూడా తినే అలవాటుంటే..!
Food and Pizza

ఇప్పటి రోజుల్లో చిన్నవయసువారికే గుండె పోటు చూస్తున్నాం. దీనితో కొందరు చనిపోతున్నారు కూడా. గతంలో కాస్త వయసుపైబడినవారిలో మాత్రమే గుండెజబ్బు సమస్య ఉండేది. మరి ఇప్పటిరోజుల్లో గుండెపోటు కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన టీవీ షో అనుపమ ప్రముఖ నటుడు నితీష్ పాండే మరణానికి కార్డియాక్ అరెస్ట్ కూడా కారణమైంది. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా 51 ఏళ్ల నటుడు నితేష్ మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు పోలీసులు.

స్పైసీగా ఉండే ఆహారాన్ని ఇష్టంగా తినేసేవారంతా కాస్త ఆలోచించాల్సిందే.. , కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మెరుగైన ఫిట్‌నెస్ గా ఉన్నా కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా ఈ రకమైన ఆహారాన్ని ఇష్టపడితే, వెంటనే ఈ అలవాట్లను మార్చుకోండి.

1. చక్కెర

మనం రోజూ తీసుకునే ఆహారంలో చక్కెర బరువు పెరగడానికి కారణం అవుతుంది. దీనిని ఎక్కువగా వాడటం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి గుండె జబ్బులను పెంచడానికి కారణం అవుతుంది.

2. ఫాస్ట్ ఫుడ్, పిజ్జా

ముఖ్యంగా మార్కెట్‌లోని ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోవాలి.. వీటిలో, కొవ్వును పెంచే పదార్థాలను ఉపయోగించే పిజ్జా ఒకటి. అందుకే ఇది చాలా ప్రమాదకరమైనది. కొలెస్ట్రాల్‌ను చాలా వేగంగా పెంచడం ద్వారా, గుండెపోటు ప్రమాదానికి చేరువ చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి మంచిది కదా అని చెరకు రసాన్ని అదే పనిగా తాగితే జరిగేది ఇదే.. నష్టాలు కూడా ఉన్నాయని తెలిస్తే..!

3. డీప్ ఫ్రైడ్ ఫుడ్

బాగా వేయించిన ఆహారం ఎల్లప్పుడూ మన శరీరానికి హాని చేస్తుంది. వేయించిన ఆహార పదార్థాల వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో చాలా రకాల చెడు నూనెలు ఉపయోగిస్తారు.

4. డైట్ సోడా

డైట్ సోడా కొవ్వు పెరిగేందుకు, కారణం అవుతుంది. బదులుగా, ఇది మధుమేహం, గుండె జబ్బులను తెచ్చిపెడుతుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల గుండెపోటు వ్యాధి విస్తరిస్తోంది. ధూమపానం, కాలుష్యం కూడా పరిస్థితిని చాలా దారుణంగా మారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.

Updated Date - 2023-06-17T13:06:49+05:30 IST