Health Facts: రోజుకు 10 గంటలకు పైగా కూర్చునే ఉంటే.. జ్ఞాపకశక్తి కోల్పోతారా..? ఓ పరిశోధనలో ఏం తేలిందంటే..!
ABN , First Publish Date - 2023-09-29T15:03:47+05:30 IST
ఈ అధ్యయనంలో Dementia నిర్ధారణ లేని 60 ఏళ్లు పైబడిన 50,000 మంది పెద్దలపై పరిశోధనలు చేసారు.
ఈమధ్య కాలంలో ఒక అధ్యయనంలో ఎలాంటి కదలికలు లేని నిశ్చలమైన జీవనశైలికి అలవాటు పడటం అనేది అన్ని వయసుల వారికీ ముప్పుగానే మారింది. కాకపోతే ఉద్యోగాలు, చదువుల కారణంగా ప్రతి ఒక్కరికీ ఈ జీవన శైలి తప్పడం లేదు. మామూలుగా రోజుకు 10 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని టీవీ చూసే వృద్ధులకు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చాలా సేపు కూర్చోవడం, పడుకోవడంతో రోజంతా వ్యాయామం చాలా తక్కువగా ఉండటంతో చాలారకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి రోజుల్లో ఉద్యోగాల కారణంగా, పెద్దగా కదలికలు లేకుండా పోవడం, కూర్చుని టీవీలను గంటల తరబడి చూడటం, అలాగే ఎక్కువ సమయం పడుకోవడం, కూర్చోవడం కూడా ప్రమాదంగా మారుతోంది. అలాగే నడక లేకపోవడం, పిల్లల్లో ఆటల్లో హుషారు లేకపోవడం వంటివి ఊబకాయానికి, ఉత్సాహం లేకపోవడానికి కారణం అవుతుంది. ఇదే పెద్దవయసు వారైతే పరిస్థితి చిత్తవైకల్యం Dementia కు దారి తీస్తుంది. దీని మీద జరిగిన అధ్యయనంలో ఏం తేలిందంటే..
ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడి, నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడాన్ని కాస్త బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఆ రకమైన విధానాన్ని ట్రై చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం ఉంటుంది. ఈ అధ్యయనంలో Dementia నిర్ధారణ లేని 60 ఏళ్లు పైబడిన 50,000 మంది పెద్దలపై పరిశోధనలు చేసారు.
ఇది కూడా చదవండి: అసలు రోజుకు ఎన్ని గుడ్లను తినొచ్చు..? లిమిట్ దాటి మరీ గుడ్లను తింటే జరిగేది ఏంటంటే..!
ఒక వారం పాటు రోజుకు 24 గంటల పాటు యాక్సిలెరోమీటర్‌లను వేసి వారి కదలికలను కనుగొన్నారు.
యాక్సిలరోమీటర్ డేటా, అధునాతన కంప్యూటింగ్ టెక్నిక్‌లతో కలిపి, విశ్లేషించగా.. సగటున ఆరు సంవత్సరాల ఫాలో అప్ తర్వాత, పరిశోధకులు చిత్తవైకల్యం నిర్ధారణను నిర్ణయించడానికి ఇన్‌పేషెంట్ హాస్పిటల్ రికార్డులు, డెత్ రిజిస్ట్రీ డేటాను ఉపయోగించారు. Dementia సానుకూలంగా 414 కేసులను కనుగొన్నారు.