Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? అస్సలు చేయకూడని ఈ మిస్టేక్స్ ఏంటో ముందే తెలుసుకోండి..!
ABN , First Publish Date - 2023-08-18T16:00:56+05:30 IST
బరువు తగ్గుతున్నప్పుడు, ఇతర రోజువారీ అలవాట్లను మరచిపోకూడదు. శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారపు విధానాలు, ఒత్తిడి నిర్వహణకు సాయపడతాయి.
శరీరంలో పెరిగే బరువు విషయంలో డైటింగ్, ఇతర మార్గాల ద్వారా అదనపు బరువును కోల్పోవడం మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు చాలా ముఖ్యం. ఆహారం తీసుకోవడం అనే విషయంలో అనేక సలహాలను పాటించడం మొదలుపెట్టాకా అది మన మీద విపరీతమైన ఒత్తిడిని తెస్తుంది. దీనితో అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. అందువల్ల, బరువు తగ్గడాన్ని చాలా జాగ్రత్తగా, సరైన మార్గాల్లో సాధన చేయడం చాలా ముఖ్యం. బరువు తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడంలో పడి చాలామంది చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటంటే..
1. ఆకలి ప్రకారం తినండి.
తినే సామర్థ్యం కంటే ఎక్కువ, తక్కువ తినడం అనేది ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. అనేక అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది.
2. వ్యాయామం చేయడానికి సమయం కేటాయించండి.
ఆ అదనపు కిలోలను తగ్గించే విషయంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గుతున్నప్పుడు, శారీరక వ్యాయామాలు చేయడం వల్ల శరీరం శక్తి కోసం ఉపయోగించే కేలరీల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. శారీరక శ్రమ అనేది కేలరీలను ఉపయోగించడం, తినే కేలరీలను తగ్గించడంతో పాటు, బరువు తగ్గడానికి కారణమయ్యే కేలరీల లోటును ఏర్పరుస్తుంది.
ఇది కూడా చదవండి: బెడ్ లైట్ వేసుకుని మరీ పడుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
3. సమయానికి నిద్రపోవడాన్ని ఒక పాయింట్‌గా చేసుకోండి.
బరువు పెరగడానికి దోహదపడే మరో ప్రధాన అంశం సరైన నిద్ర లేకపోవడం. పేలవమైన నిద్ర సాధారణంగా ఆక్సీకరణ ఒత్తిడి, రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. మెలకువగా ఉన్న సమయం తినే అవకాశాలను పెంచుతుంది. తక్కువ నిద్రపోవడం వల్ల సిర్కాడియన్‌కు భంగం కలిగిస్తుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
4. Sustainability ని దృష్టిలో ఉంచుకోండి.
బరువు తగ్గుతున్నప్పుడు, ఇతర రోజువారీ అలవాట్లను మరచిపోకూడదు. శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారపు విధానాలు, ఒత్తిడి నిర్వహణకు సాయపడతాయి.
5. బరువు తగ్గడం అనేది జీవితం కాదు.
బరువు తగ్గడం ఒక లక్ష్యం కావచ్చు కానీ జీవితం చుట్టూ తిరగాల్సిన ఏకైక లక్ష్యం కాదు. బరువు తగ్గించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే నిరుత్సాహపడకూడదు, ఎందుకంటే బరువు తగ్గడం అనేది జీవితం కాదు.