Naegleria Fowleri: ఏంటీ ఈ నగ్లేరియా ఫాలెరీ..? ఈ వింత వ్యాధి రెండేళ్ల వయసున్న ఓ పిల్లాడిని ఎలా చంపేసిందంటే..!
ABN , First Publish Date - 2023-07-25T16:08:50+05:30 IST
ఈ జీవి మానవ శరీరం లోపల మార్గాన్ని చేరినప్పుడు, ఇది మెదడులో అరుదైన, ఇంకా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్, వాపుకు కారణమవుతుంది.
ఈ సృష్టిలో ఎన్నో జీవరాసులు.. కొన్ని మనకు మేలు చేసేవి కొన్ని కీడు చేసేవి. కొన్ని కంటికి కనిపించేవి. కొన్ని కనిపించకుండా ఆరోగ్యం మీద దాడి చేసేవి. అలాంటి జీవులు ఉన్నాయని కానీ వాటితో మనం బ్రతుకుతున్నామని కానీ మన ఊహకు కూడా అందదు. మన రాత బాగోకపోతే.. ఈ భూమిమీద నూకలు చెల్లిపోతే మాత్రమే ఈ రకాల వ్యాధులు, ఈ రకం జీవుల వల్ల కలుగుతుందని తెలుస్తుంది. విషయంలోకి వెళితే ఈ జీవి నీటిలో ఉంటుంది. అది కంటికి కనిపించదు. నీటిలో ఉంటే ఏమీకాదు. ఆ నీటిని తాగినా ఏమీ కాదట. కానీ.. ముక్కు గానీ ఆ జీవి వున్న నీటితో శుభ్రం చేసుకున్నామా ఇక అంతే సంగతులు.. అది మన ముక్కు గుండా ప్రయాణించి మెదడుకు చేరుకుని అక్కడ చిన్న చిన్నగా మెదడును తినేస్తుందట. అలాగే పాపం ఓ ప్రాణం పోయింది. ఓ రెండేళ్ళ బాలుడు ఈ జీవికి చిక్కి ప్రాణాలను కోల్పోయాడు. అప్పుడే మళ్ళీ ఈ జీవి గురించిన చర్చ అంతటా మొదలైంది.
నెగ్లేరియా ఫాలెరీ అనే ఈ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరుతుంది. దీని ద్వారా కలిగే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకమైనవి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఇదే విషయాన్ని చెప్తోంది. నీటి వల్ల ఇన్ఫెక్షన్ సోకి ప్రాణం పోయేంత వరకూ వెళుతుంది.
ఈ అరుదైన మెదడును తినే అమీబాను నేగ్లేరియా ఫౌలెరీ అంటారు. ఇది సాధారణంగా కలుషితమైన కొలనులు, మంచినీటి సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు, మట్టిలో కనిపిస్తుంది. సాధారణంగా అమీబా మాదిరిగానే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఇది మైక్రోస్కోప్‌తో మాత్రమే కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోతోందా..? ఈ 5 అంశాలే అసలు కారణాలు.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..!
ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా సరస్సులు, నదుల వంటి మంచి నీటి కింద తలలు పెట్టినప్పుడు, అమీబా అప్పుడు ముక్కు నుండి మెదడుకు చేరుకుంటుంది, మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే వినాశకరమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
ఈ జీవి మానవ శరీరం లోపల మార్గాన్ని చేరినప్పుడు, ఇది మెదడులో అరుదైన, ఇంకా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్, వాపుకు కారణమవుతుంది. చివరికి మెదడును తినడం ద్వారా మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది.