Weight Loss Tips: కష్టపడకుండానే కొవ్వు కరగాలంటే.. రోజూ పొద్దునే గ్లాసుడు నీళ్లల్లో ఈ గింజలను కలుపుకుని తాగితే..!

ABN , First Publish Date - 2023-07-15T14:59:42+05:30 IST

బరువు తగ్గించే ఆహారంలో చియా విత్తనాలను కూడా చేర్చవచ్చు

Weight Loss Tips: కష్టపడకుండానే కొవ్వు కరగాలంటే.. రోజూ పొద్దునే గ్లాసుడు నీళ్లల్లో ఈ గింజలను కలుపుకుని తాగితే..!
reducing obesity

బరువు తగ్గడం అనేది అంత సులువైన పనైతే కాదు. ఒక్కసారిగా పెరిగిన బరువు కాదు కనుక శరీరంలోని అధిక బరువును నెమ్మదిగా కోల్పోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది. శరీరంలోని మొండి కొవ్వును కరిగించడం చాలా కష్టం. కఠినమైన వ్యాయామాలు, అలాగే తగిన ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఆహారంలో కూడా నియంత్రణ అవసరం. దీనికోసం చాలా సమయమే తీసుకుంటుంది మన శరీరం. మొండి కొవ్వును వదిలించుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తీవ్పమైన వ్యాయామంతో పాటు ఆహారం తీసుకోవడంలోనూ, ద్రవ పదార్థాలు తాగడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే కొవ్వు కరగడం మొదలవుతుంది.

కొవ్వును కరిగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వాటిలో లిన్సీడ్ (Flaxseed) గింజల ఊబకాయాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి, ఇవి ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా సపోర్ట్‌గా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని అందించడంలో కూడా సహకరిస్తాయి.

ఫ్లాక్స్ సీడ్ (Flaxseed) పోషకాలు..

అవిసె గింజలలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, ఫైబర్, కాపర్, సెలీనియం, కెరోటిన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి అంశాలు ఉంటాయి. ఈ విత్తనాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్. యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంది.

ఇది కూడా చదవండి: ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని సార్లు ఏడ్చి ఉంటారో.. ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..!


ఫ్లాక్స్ సీడ్స్ (Flaxseed) ప్రయోజనాలు..

1. ఈ గింజలు బరువును తగ్గిస్తాయి. రాత్రిపూట అవిసె గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి, నిమ్మరసం కలిపిన తర్వాత త్రాగితే, కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీనిని త్రాగాలి.

2. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిండానికి కూడా అవిసె గింజలు ఉపయోగపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, ఈ గింజలను ఉపయోగించడం వల్ల ఇతర వ్యాధులు దరిచేరవు.

3. అవిసె గింజలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా పని చేస్తాయి. దీని వల్ల ముఖంలో మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆయుర్వేద గుణాలున్న ఈ గింజలు నీటిలో ఉడికించి ఆ నీటిని తలకు పట్టించడం వల్ల జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

4. ఇది కాకుండా, బరువు తగ్గించే ఆహారంలో చియా విత్తనాలను కూడా చేర్చవచ్చు. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది కడుపు నిండుగా ఉంచుతుంది, తద్వారా అధిక ఆహారాన్ని తినకుండా ఉంటారు. బరువు తగ్గడానికి పుచ్చకాయ గింజలను రోస్ట్ చేసి కూడా తినవచ్చు. బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇందులో కనిపిస్తాయి, దీని కారణంగా కొవ్వు కరుగుతుంది.

Updated Date - 2023-07-15T14:59:42+05:30 IST