Body Fat: ఈ 4 అలవాట్లే కొంప ముంచుతున్నాయ్.. రోజూ తెలియకుండానే చేసే ఈ మిస్టేక్‌ల వల్లే కొవ్వు పెరిగిపోతోంది..!

ABN , First Publish Date - 2023-06-15T16:48:41+05:30 IST

సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి లేకపోవడం వల్ల ఊబకాయం వస్తుంది.

Body Fat: ఈ 4 అలవాట్లే కొంప ముంచుతున్నాయ్.. రోజూ తెలియకుండానే చేసే ఈ మిస్టేక్‌ల వల్లే కొవ్వు పెరిగిపోతోంది..!
metabolism

ఊబకాయం, స్థూలకాయం పేర్లు ఏదైనా ఇది మన శరీరాల్లో ఎప్పటు నుంచో ఉండేది కాదు. దీనిని కావాలని తెచ్చుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి లేకపోవడం వల్ల ఊబకాయం వస్తుంది. దీనికి వ్యాయామం లేకపోవడం కూడా ప్రధాన కారణం. అయితే ఒక్కసారిగా బరువు పెరిగిపోయి శరీరాన్ని కష్టపెట్టడమే కాదు, ఇది అనేక రకాల అనారోగ్యాలకు కూడా కారణం అవుతుంది. అయితే ఉబకాయం వచ్చి పడడానికి కామన్ గా మనం చేస్తున్న విస్టేక్స్ వల్లనే శరీరంలో కొవ్వు పేరుకుంటుంది. అవేంటంటే..

ఊబకాయం ఎందుకు పెరుగుతుంది?

1. రాత్రి వేడి పాలు తాగిన తర్వాత నిద్రపోవడం అంటే దీనితో శరీరంలోనికి ఎక్కువ కేలరీలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, నిద్రపోయే ముందు టీ, కాఫీ తాగడం వల్ల సరైన నిద్రను పొందలేరు, దీని కారణంగా హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి, ఈ కారణాలతోనే బరువు వేగంగా పెరుగుతుంది.

2. అర్థరాత్రి వరకు టీవీ చూడటం, ఫోన్‌ను స్క్రోలింగ్ చేసే అలవాటు కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ చెడు అలవాట్లు బరువును పెంచడానికి కూడా పని చేస్తుంది.

ఇది కూడా చూడండి: బెల్లాన్ని కరిగించి.. సూప్‌లా చేసుకుని రోజూ తాగితే జరిగేదేంటి..? అసలు బెల్లాన్ని రోజూ తినొచ్చా..?

3. అదే సమయంలో, బరువు తగ్గడానికి భోజనాన్ని దాటవేస్తూ ఉంటారు, ఇలా చేయడం వల్ల బరువు పెరుగుతారు.

4. ఇది కాకుండా, పెయిన్ కిల్లర్ వంటి మందులు తీసుకుంటే, మలబద్ధకం సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి మందులు బరువును పెంచడానికి పని చేస్తాయి.

ఇలాంటి చిన్న చిన్న తప్పులతో అధిక బరువును కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాస్త ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నట్లయితే త్వరలోనే స్థూలకాయాన్ని వదిలించుకోవచ్చు.

Updated Date - 2023-06-15T17:00:00+05:30 IST