Weight Loss: బరువు తగ్గాలనుకుని బలంగా ఫిక్స్ అయిన వాళ్లు ఈ విషయం తెలియక ఎన్నో ట్రై చేస్తున్నారు పాపం..!
ABN , First Publish Date - 2023-02-22T11:15:49+05:30 IST
మునక్కా అనేది.. డీ హైడ్రేటెడ్ ద్రాక్ష. దీనిలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషక విలువలున్నాయి. చాలా మంది ఇప్పటికే దీని అవసరం తెలుసుకుని వాడుతూనే ఉన్నారు.
Weight Loss : మునక్కా అనేది.. డీ హైడ్రేటెడ్ ద్రాక్ష. దీనిలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషక విలువలున్నాయి. చాలా మంది ఇప్పటికే దీని అవసరం తెలుసుకుని వాడుతూనే ఉన్నారు. అంతేకాదు.. ఏదైనా అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్నవారికి దీనిని ఆహారంలో సూచించడం జరుగుతోంది. అయితే దీనిని నానబెట్టి తీసుకోవడం వలన దీనిలోని ఎసిడిటీ ప్రభావం తగ్గుతుంది. నిజానికి ఇది జీర్ణక్రియను మెరుగు పరుచుకోవడానికి అలాగే బరువు తగ్గడానికి సూపర్ ఫుడ్‌గా పరిగణించడం జరుగుతోంది. ఇంతేనా దీని ప్రయోజనాలు తెలిస్తే రోజూ మీ ఆహారంలో మునక్కను చేర్చుకోవడం పక్కా.
మునక్కాతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్..
1. బరువును తగ్గిస్తుంది. మునక్కలో ఉండే డైటరీ కరిగే ఫైబర్ మొత్తం జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది. తద్వారా ఆకలి తీరినట్టుగా అనిపించి అతిగా తినకుండా ఉండేందుకు సహకరిస్తుంది. మునక్కలో లెప్టిన్ అనే ఫ్యాట్‌ను కరిగించే హార్మోన్ కూడా ఉంటుంది.
2. బీపీని మేనేజ్ చేస్తుంది. మునక్కలో రెస్వెరాట్రాల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్. కణాలలో మంటను అరికడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
3. ఎసిడిటీ/గ్యాస్ట్రిక్ట్స్‌ను కంట్రోల్ చేస్తుంది. రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని తాగడం వలన ఎసిడిటీ, గుండె మంట నుంచి విముక్తి లభిస్తుంది. కడుపులో చల్లగా ఉండేలా చేస్తుంది.
4. పంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మునక్కాలో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రాపర్టీస్ అనేవి గమ్స్ వాపును అలాగే అల్సర్లను నివారిస్తాయి. రోజుకు 5 - 7 ఎండు ద్రాక్షను నమలడం వలన నోటి దుర్వాసర తగ్గుతుంది. డెంటల్ బ్యాక్ట్రీరియాను నిర్మూలిస్తుంది.
5. రక్తహీనతను దూరం చేస్తుంది. ఫోలేట్, ఐరన్, విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వల్ల.. ఎండు ద్రాక్ష రక్తహీనత చికిత్సలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరిచి తద్వారా.. ఆడవారిలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది.
6. పురుషులలో సంతానోత్పత్తిని పెంచుతుంది. మునక్క తీసుకోవడం వలన స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. తద్వారా మగవారిలో సంతానోత్పత్తి అనేది మెరుగుపడుతుంది.
7. బోన్ హెల్త్‌కి చాలా బాగా మునక్క ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఆర్ధరైటిస్, ఆస్టియో ఆర్ధరైటిస్ ఉండి ఉంటే.. మునక్కా తీసుకుంటే చాలా బాగా ఉపశమనం కలుగుతుంది. ఇది మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలెట్, పొటాషియంల స్టోర్ హౌస్. బోన్ డెన్సిటీని ఇది కాపాడుతుంది.