Dubai: విజిట్ వీసాదారులకు షాకిచ్చిన దుబాయ్.. ఇకపై అది వీలు పడదు..
ABN , First Publish Date - 2023-01-01T12:19:32+05:30 IST
విజిట్ వీసాదారులు (Visit Visa Holders) దుబాయ్ జారీ చేసిన పర్మిట్‌లతో సహా వారి వీసాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఉండి పునరుద్ధరించుకోవడం ఇకపై వీలు పడదు.
దుబాయ్: విజిట్ వీసాదారులు (Visit Visa Holders) దుబాయ్ జారీ చేసిన పర్మిట్‌లతో సహా వారి వీసాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఉండి పునరుద్ధరించుకోవడం ఇకపై వీలు పడదు. ఈ పద్దతికి తాజాగా స్వస్తి పలికారు. "ఇకపై యూఏఈలో ఉంటూ ఏ టూరిస్టరూ కూడా తమ వీసా స్టేటస్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. తమ వీసాలను పనరుద్ధరించాలనుకునే వ్యక్తులు దేశం నుంచి నిష్క్రమించి, ఆపై తిరిగి ఎంటర్ కావాల్సి ఉంటుంది" అని మూస మూస్జి ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ చీఫ్ రాజేష్ బాబు యాదవ్ అన్నారు. యూఏఈలో గత డిసెంబర్ ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగానే పర్యాటకులకు (Visitors) దేశంలోని వారి టూరిస్ట్ వీసాలను (Tourist Visa) పొడిగించుకునే ఛాయిస్‌ను యూఏఈ నిలిపివేసింది.
అయితే, దుబాయిలో నివాసం ఉండేవారు వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి పర్యాటకులను అనుమతి ఇవ్వడం కొనసాగించింది. కానీ, తాజాగా వీసాల పొడిగింపును దుబాయ్ (Dubai) కూడా ఎత్తివేసింది. గతంలో కూడా ఇదే నిబంధన అమలులో ఉండేదట. అయితే, మహమ్మారి కరోనా సమయంలో టూరిస్టులకు అసౌకర్యం కలగకూడదని నిబంధనలు సవరించినట్లు రాజేష్ బాబు తెలిపారు. ఆ సమయంలో ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో మానవతదృక్పథంతో కొన్ని వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు మహమ్మారి ప్రభావం తగ్గి సాధారణపరిస్థితులు నెలకొనడంతో ఇంతకుముందులానే వీసా నిబంధనలను అమలు చేయాలనే నిర్ణయానికి యూఏఈ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.