Canada: విదేశీ విద్యార్థులకు కెనడా గట్టి షాక్.. ఆ వ్యయం రెట్టింపు!
ABN , First Publish Date - 2023-12-10T06:44:39+05:30 IST
కెనడాలో విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు ఇకపై దైనందిన ఖర్చుల కోసం మరింత సొమ్ము తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇమిగ్రేషన్ రెఫ్యుజీస్ అండ్ సిటిజన్‌షి్‌ప కెనడా (ఐఆర్‌సీసీ).. ‘జీవనవ్యయం ఆర్థిక అవసరాలకు’ (కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫైనాన్షియల్ రిక్వైర్‌మెంట్‌కు) సంబంధించిన కొత్త నిబంధనలను ప్రకటించింది.
విద్యార్థుల జీవన వ్యయం కనీస మొత్తాన్ని రూ.12 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ, డిసెంబరు 9: కెనడాలో విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు ఇకపై దైనందిన ఖర్చుల కోసం మరింత సొమ్ము తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇమిగ్రేషన్ రెఫ్యుజీస్ అండ్ సిటిజన్‌షి్‌ప కెనడా (ఐఆర్‌సీసీ).. ‘జీవనవ్యయం ఆర్థిక అవసరాలకు’ (కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫైనాన్షియల్ రిక్వైర్‌మెంట్‌కు) సంబంధించిన కొత్త నిబంధనలను ప్రకటించింది. వీటి ప్రకారం ఒక విద్యార్థి కనీసం 20,635 కెనడియన్ డాలర్లు (రూ.12,66,476) తన వద్ద ఉన్నట్లు చూపించాలి. ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. కెనడాలో పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఐఆర్‌సీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక విద్యార్థికి స్టడీ పర్మిట్ ఇవ్వటానికి ఫైనాన్షియల్ రిక్వైర్‌మెంట్ కింద పది వేల కెనడియన్ డాలర్లను కనీస మొత్తంగా పరిగణిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కిందట నిర్ణయించిన ఈ మొత్తాన్ని ఇప్పటి వరకూ పెంచలేదు. దీనివల్ల కెనడాకు వచ్చిన విద్యార్థులు.. అక్కడ పెరిగిపోయిన జీవన వ్యయానికి తగినంత డబ్బు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, కనీస మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.
మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.