Visa on Arrival: 50 కంటే ఎక్కువ దేశాల పౌరులకు యూఏఈ తీపి కబురు
ABN , First Publish Date - 2023-03-19T09:38:12+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 50 దేశాల కంటే ఎక్కువ దేశాల పౌరులకు వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 50 దేశాల కంటే ఎక్కువ దేశాల పౌరులకు వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. నెల రోజుల వ్యవధితో ఇవి అందుబాటులో ఉంటాయి. మరో 10రోజులు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అలాగే ఇతర కొన్ని షరతులతో 90 రోజుల వ్యవధితో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక ఈ 50 దేశాల పౌరులు కాకుండా మిగత దేశాల వారు మాత్రం యూఏఈకి రాకముందే ఎంట్రీ పర్మిట్ (Entry Permit) పొందాల్సి ఉంటుంది. అంతేగాక దీనికి వేరే వాళ్లు స్పాన్సర్ చేయాల్సి ఉంటుందని యూఏఈ డిజిటల్ గవర్న్‌మెంట్ (DGO) తెలియజేసింది. కాగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) దేశాల వారికి మాత్రం వీసా లేదా ఎంట్రీ పర్మిట్ అవసరం లేదని తెలిపింది. జీసీసీ (GCC) దేశాల పౌరులు యూఏఈలోకి ప్రవేశించే సమయంలో వారి దేశాలల్లో జారీ చేసిన పాస్‌పోర్టు లేదా నేషనల్ ఐడీ చూపిస్తే సరిపోతుందని డీజీఓ పేర్కొంది.
ఇక 'విజిట్ దుబాయి' వెబ్‌సైట్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాల పౌరులు నెల లేదా 3నెలల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. అలాగే యూఏఈ వీసా కోసం https://www.visitdubai.com ద్వారా అతని/ఆమె అర్హతను చెక్ చేసుకోవచ్చు. సాధారణ పాస్‌పోర్టు, యూఎస్ఏ జారీ చేసిన విజిట్ వీసా లేదా గ్రీన్ కార్డు లేదా యూకే, ఈయూ జారీ చేసిన రెసిడెన్సీ వీసా కలిగిన భారతీయ పౌరులు కూడా వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పొందవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: భిక్షాటన చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయి అధికారులు.. అతడి వద్ద ఉన్న నగదును చూసి నోరెళ్లబెట్టారు..!