Upendra Chivukula: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగోడి ప్రజాసేవకు ప్రత్యేక గుర్తింపు

ABN , First Publish Date - 2023-01-15T08:13:13+05:30 IST

అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకులకు (Upendra Chivukula) మరో అరుదైన గౌరవం లభించింది.

Upendra Chivukula: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగోడి ప్రజాసేవకు ప్రత్యేక గుర్తింపు

ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు

న్యూజెర్సీ పరిపాలన విభాగం ప్రశంసలు

న్యూజెర్సీ: అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకులకు (Upendra Chivukula) మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం.. ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. న్యూజెర్సీ పబ్లిక్ యూటీలీటీస్ బోర్డు సమావేశంలో కమిషర్లు ఫియోర్డలిసో, హోల్డెన్, సోలమన్, గోర్డాన్, క్రిసోడౌలాలు... ఉపేంద్ర చివుకుల సేవలను గుర్తించి చేసిన తీర్మాన ప్రకటనను ఆయనకు అందించారు. పన్ను చెల్లింపుదారులు, రేట్ పేయర్స్ కోసం గత 25 సంవత్సరాలుగా ఉపేంద్ర చివుకుల చేసిన సేవలు మరువలేనివిగా వారు అభివర్ణించారు. చిత్తశుద్ధితో, సేవా దృక్పథంతో పనిచేసిన ఉపేంద్ర చివుకులకు కృతజ్ఞతలు తెలుపుతూ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా ఓ ప్రశంస పత్రాన్ని ఉపేంద్ర చివుకులకు అందించారు.

Upendraaa.jpg

Updated Date - 2023-01-15T08:13:15+05:30 IST