Dubai: ప్రవాసులకు బెస్ట్ సిటీస్‌లో దుబాయ్ టాప్-3లో నిలవడానికి కారణం అదేనట..!
ABN , First Publish Date - 2023-01-21T08:20:23+05:30 IST
ప్రవాసులకు (Expats) నివాసానికి, పనికి సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను ఇటీవల ఇంటర్నేషన్స్ సంస్థ (InterNations) విడుదల చేసిన విషయం తెలిసిందే.
దుబాయ్: ప్రవాసులకు (Expats) నివాసానికి, పనికి సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను ఇటీవల ఇంటర్నేషన్స్ సంస్థ (InterNations) విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఇంటర్నేషన్స్ ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్-2022' (InterNations Expat City Ranking list 2022) పేరిట ఈ జాబితాను విడుదల చేసింది. ఇక ఈ ర్యాంకింగ్ ప్రకారం వలసదారులకు అత్యంత అనువైన టాప్-3 నగరాలుగా స్పెయిన్‌లోని వాలెన్సియా (Valencia), దుబాయ్, మెక్సికో సిటీ నిలిచాయి. రెండో ర్యాంక్ కైవసం చేసుకున్న దుబాయ్‌లో (Dubai) కొత్తగా వచ్చేవారికి ఘన స్వాగతం లభిస్తుందని ఇంటర్నేషన్స్ సర్వే తేల్చింది. అంతేగాక ఇక్కడ స్థానిక అధికారులతో ప్రవాసులకు డీలింగ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయట. అలాగే ప్రభుత్వ సేవలను సైతం వలసదారులు ఆన్‌లైన్ ద్వారానే చాలా సులువుగా పొందే వెసులుబాటు దుబాయ్‌లో ఉంది.
ఈ విషయంలో 88శాతం మంది ఈ నగరమే బెస్ట్ అని పేర్కొన్నారు. ఇక ఇక్కడ ఉంటున్న ప్రవాసుల్లో 70శాతం మంది తమ ఉద్యోగాలతో సంతృప్తిగా ఉన్నామని చెప్పడం విశేషం. అలాగే ఇక్కడి స్థానిక వ్యాపార సంస్కృతి సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నామని తెలిపారు. ఇదిలాఉంటే.. వలసదారులకు అత్యంత అనుకూలమైన దేశాల జాబితాలో వాలెన్సియా (Valencia), దుబాయ్, మెక్సికో సిటీ తర్వాతి స్థానాల్లో లిస్బన్, మాడ్రిడ్, బ్యాంకాక్, బసెల్, మెల్‌బోర్న్, అబుదాబి, సింగపూర్ నగరాలు నిలిచాయి.