Operation Kaveri first batch: హమ్మయ్యా.. ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరిన 278 మంది భారతీయులు

ABN , First Publish Date - 2023-04-26T07:18:49+05:30 IST

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరీ’లో భాగంగా తొలి విడతలో 278 మంది స్వదేశానికి బయల్దేరారు.

Operation Kaveri first batch: హమ్మయ్యా.. ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరిన 278 మంది భారతీయులు

ఆపరేషన్‌ కావేరీ తొలి బ్యాచ్‌లో 278 మంది

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరీ’లో భాగంగా తొలి విడతలో 278 మంది స్వదేశానికి బయల్దేరారు. సూడాన్‌ పోర్టులో ప్రస్తుతం 500 మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ సుమేధలో మంగళవారం 278 మంది భారతీయులు బయల్దేరారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విటర్‌లో పేర్కొన్నారు. సూడాన్‌లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి నీమా సయీద్‌ అబిద్‌ పేర్కొన్నారు. సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగంగా తిరుగుబాటుదారులు రాజధానిలోని ప్రభుత్వ జాతీయ ల్యాబొరేటరీని ఆక్రమించారని తెలిపారు. పోలియో, తట్టు వంటి పలు వ్యాధులకు సంబంధించిన నమూనాలను ఈ ల్యాబ్‌లో భద్రపరుస్తారు. ఈ ల్యాబ్‌ను ఆక్రమించుకొన్న ఫైటర్లు అక్కడి టెక్నీషియన్లందరినీ తరిమేశారని.. సైనిక స్థావరంగా వాడుకుంటున్నారని సయీద్‌ తెలిపారు. దీన్ని అతిపెద్ద జీవ (బయోలాజికల్‌) ముప్పుగా అభివర్ణించారు.

Updated Date - 2023-04-26T07:18:49+05:30 IST