UAE: ఈ బుడతడు మాములోడు కాదు.. నాలుగేళ్లకే గిన్నిస్ రికార్డు‌కు ఎక్కేశాడు..!

ABN , First Publish Date - 2023-04-02T11:35:34+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (United Arab Emirates) చెందిన నాలుగేళ్ల బుడతడు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కాడు (Guinness World Record).

UAE: ఈ బుడతడు మాములోడు కాదు.. నాలుగేళ్లకే గిన్నిస్ రికార్డు‌కు ఎక్కేశాడు..!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (United Arab Emirates) చెందిన నాలుగేళ్ల బుడతడు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కాడు (Guinness World Record). సయీద్ రషీద్ అల్మెమెరి అనే బాలుడు ఒక పుస్తకాన్ని ప్రచురించిన అతిపిన్న వయస్కుడిగా(మేల్) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. సయీద్ రాసిన 'ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్' (The Elephant Saeed and the bear) అనే బుక్ ఆ దేశంలో అద్భుత ఆదరణ దక్కించుకుంది. మార్చి 9వ తేదీ నాటికి 1000 కాపీలు అమ్ముడుపోయాయి. రెండు జంతువుల మధ్య ఊహించని స్నేహం, కోపంపై దయ విజయం సాధించడం అనే విషయాలను ఈ పుస్తకంలో సయీద్ చక్కగా వివరించడం జరిగింది.

UAE-Boy.jpg

ఇక సయీద్ అక్క అల్దాబీ (AlDhabi) కూడా 8ఏళ్లకే ఒకే పుస్తకాన్ని రెండు భాషల్లో రాసిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ఈమెనే సయీద్‌కు గురువు కూడా. అల్దాబీ స్థానికంగా పబ్లిషింగ్ హౌస్ 'రెయిన్‌బో చిమ్నీ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్‌'ను (Rainbow Chimney Educational Aids) నడుపుతోంది. ఈ రెయిన్‌బో చిమ్నీ.. 4 నుంచి 10ఏళ్ల వయసు గల పిల్లలకు రాయడానికి సహాయపడుతుంది. ఈ పబ్లిషింగ్ హౌస్ ఇప్పటికే మూడు పుస్తకాలను ప్రచురించింది. మరో 13 బుక్స్ ప్రచురణ దశలో ఉన్నాయి. దీంతో ఈ అక్క తమ్ముడు ఇప్పుడు స్థానికంగా బాగా ఫేమస్ అయిపోయారు.

UAE jobs: డొమెస్టిక్ వర్కర్లకు కొత్త శాలరీ రూల్.. ఇకపై యజమానులు తప్పనిసరిగా..!

Updated Date - 2023-04-02T11:41:16+05:30 IST