MidEast Political Crisis: బహ్రెయిన్‌లో అనూహ్య పరిణామం.. భారీగా తగ్గిన హాలిడే బుకింగ్స్.. ట్రావెల్ ఏజెంట్ల ఆందోళన..!
ABN , First Publish Date - 2023-11-10T11:27:23+05:30 IST
సాధారణంగా బహ్రెయిన్‌లో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం దేశ పౌరులు, నివాసితులు భారీగా విదేశాలకు తరలి వెళ్తుంటారు. దీంతో ఈ సీజన్లో విదేశీ ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
మనామా: సాధారణంగా బహ్రెయిన్‌లో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం దేశ పౌరులు, నివాసితులు భారీగా విదేశాలకు తరలి వెళ్తుంటారు. దీంతో ఈ సీజన్లో విదేశీ ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే, ఈసారి ఈ పండుగ కాలంలో కూడా విమాన బుకింగ్‌లకు అసాధారణంగా డిమాండ్ తగ్గడంతో ట్రావెల్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది హాలిడే ట్రావెల్ బుకింగ్‌ల (Holiday Travel Bookings) లో గణనీయమైన తగ్గుదల నమోదు కావడం పట్ల ట్రావెల్ ఏజెంట్లు (Travel Agents) గగ్గొలు పెడుతున్నారు. ట్రావెల్ నిట్స్ అండ్ వకాన్జా డైరెక్టర్ థాహా మార్జూక్ ఓ ఇంటర్వ్యూలో వింటర్ హాలిడే ఫ్లైట్ బుకింగ్‌లకు ఊహించని రీతిలో డిమాండ్ తగ్గడం షాక్‌కు గురి చేసిందన్నారు.
Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!
ఈసారి అనూహ్యంగా బుకింగ్‌లు తగ్గడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న సంక్షోభం (MidEast Political Crisis) కారణంగా చాలామంది హాలిడే ప్రణాళికలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. బ్రిటన్, టర్కీ వంటి ప్రసిద్ధ శీతాకాల సెలవుల గమ్యస్థానాలకు సైతం గతేడాదిలో పోలిస్తే తక్కువ బుకింగ్స్ నమోదవుతున్నాయని మార్జూక్ పేర్కొన్నారు. అయితే, రాబోయే బహ్రెయిన్ జాతీయ దినోత్సవ సెలవుల సందర్భంగా హాలిడే ప్యాకేజీల (Holiday Packages) కు డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికి మధ్యప్రాచ్య రాజకీయ సంక్షోభం సమసిపోతుందని ఆయన అన్నారు.