NASA: భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు
ABN , First Publish Date - 2023-01-11T07:38:30+05:30 IST
ప్రఖ్యాత ‘నాసా’ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ఇండియన్-అమెరికన్ ఎ.సి.చనారియా నియమితులయ్యారు.
నాసా చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ఇండియన్-అమెరికన్ చనారియా
వాషింగ్టన్, జనవరి 10: ప్రఖ్యాత ‘నాసా’ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ఇండియన్-అమెరికన్ ఎ.సి.చనారియా నియమితులయ్యారు. ఆయన నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు ప్రధాన సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, వ్యూహాలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో సంబంధాలు తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇంతవరకు తాత్కాలిక చీఫ్ టెక్నాలజిస్టుగా పనిచేసిన మరో ఇండియన్-అమెరికన్ భవ్య లాల్ నుంచి ఆయన ఈ నెల 3న బాధ్యతలు స్వీకరించారు.