Bahrain: భారతీయ సమాజం సేవలపై ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2023-07-07T10:04:27+05:30 IST

బహ్రెయిన్‌లో సామాజిక, వాణిజ్య డైనమిక్స్‌ను సుసంపన్నం చేయడంలో భారతీయ సమాజం పాత్ర కీలకం అని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా (Shaik Khalifa bin Abdulla bin Khalifa Al Khalifa) ప్రశంసల వర్షం కురిపించారు.

Bahrain: భారతీయ సమాజం సేవలపై ప్రశంసల వర్షం

మనామా: బహ్రెయిన్‌లో సామాజిక, వాణిజ్య డైనమిక్స్‌ను సుసంపన్నం చేయడంలో భారతీయ సమాజం పాత్ర కీలకం అని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా (Shaik Khalifa bin Abdulla bin Khalifa Al Khalifa) ప్రశంసల వర్షం కురిపించారు. క్రౌన్ ప్రిన్, ప్రధాని హిస్ రాయ్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా (Salman bin Hamad Al Khalifa) మద్దతుతో బహ్రెయిన్ సంస్కృతుల సమ్మేళనంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. శాంతియుత జీవనం, సామాజిక సామరస్యం, సహనం విలువలు శాతాబ్దాలుగా ఎల్లప్పుడు ప్రసిద్ధి చెందాయన్నారు. తట్టై హిందూ మర్చంట్స్ కమ్యూనిటీ (Thattai Hindu Merchants Community) అధ్యక్షుడు ముఖేష్ కవలాని, దాని సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్ఏం రాజు నాయకత్వంలో బహ్రెయిన్‌లో సహనం, విలువలను వ్యాప్తి చేయడంలో మానవతావాద ప్రయత్నాలకు సహకరించిన బహ్రెయిన్‌లోని ఇండియన్ కమ్యూనిటీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-07-07T10:04:27+05:30 IST