UK: గత నెలలోనే యూనివర్సిటీలో చేరిన భారతీయ విద్యార్థిని.. అంతలోనే తీవ్ర విషాదం..!
ABN , First Publish Date - 2023-03-01T11:07:04+05:30 IST
బ్రిటన్‌లో ఓ భారతీయ విద్యార్థిని (Indian Origin Student) ఊహించని విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.
లండన్: బ్రిటన్‌లో ఓ భారతీయ విద్యార్థిని (Indian Origin Student) ఊహించని విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది. నార్త్ ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్టాప్‌లో (Bus Stop) వేచి చూస్తున్న భారతీయురాలిపై కారు రూపంలో మృత్యు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని కేరళకు (Kerala) చెందిన అథిరా అనిల్ కుమార్ లాలీ కుమారిగా (Athira Anilkumar Laly Kumari ) వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక లీడ్స్ మలయాళీ అసోసియేషన్ సమాచారం ప్రకారం.. కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన అథిరా అనిల్ కుమార్ లాలీ, లీడ్స్ బెకెట్ విశ్వవిద్యాలయంలో (Leeds Beckett University) చదువుతున్నారు. గత నెలలోనే ఇక్కడ ఆమె అడ్మిషన్ పొందారు. ఈ నెల 22న యూనివర్శిటీకి వెళ్లేందుకు బస్టాప్‌లో బస్ కోసం వేచి చూస్తుంది. ఇంతలో ఓ కారు ఒక్కసారిగా బస్టాప్‌వైపు దూసుకొచ్చింది. అక్కడ వేచి చూస్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అథిరా సహా మరో ఇద్దరు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అథిరా చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాతికేళ్ల ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు యార్క్‌షైర్ పోలీసులు నిర్ధారించారు. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఒక ప్రాణం పోయిందని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: బ్లూ కాలర్ వర్కర్స్, విజిట్ వీసాదారులకు ఈ 7 రెస్టారెంట్లలో ఉచిత భోజనం..