Indian Woman: ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం.. బహ్రెయిన్‌లో భారతీయ మహిళ ఇక్కట్లు.. చివరికి

ABN , First Publish Date - 2023-04-14T20:29:48+05:30 IST

ఉద్యోగం పేరిట ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ (Bahrain) వచ్చి మోసపోయిన భారతీయ మహిళను (Indian Woman) ఇండియన్ ఎంబసీ అండగా నిలిచింది.

Indian Woman: ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం.. బహ్రెయిన్‌లో భారతీయ మహిళ ఇక్కట్లు.. చివరికి

మనామా: ఉద్యోగం పేరిట ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ (Bahrain) వచ్చి మోసపోయిన భారతీయ మహిళను (Indian Woman) ఇండియన్ ఎంబసీ అండగా నిలిచింది. ఆమెను వారి చెర నుంచి విడిపించి సురక్షితంగా తిరిగి స్వదేశానికి పంపించింది. నార్త్ గోవా జిల్లాలోని తిస్వాడికి చెందిన 23 ఏళ్ల యువతి మంగళవారం దుబాయి (Dubai) మీదుగా ప్రయాణించి ఢిల్లీలో సురక్షితంగా దిగింది. ఆమె ఫిబ్రవరిలో ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ చేరుకుంది. ఎంప్లాయిమెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదిరిన ఉద్యోగంలో కాకుండా ఆమెను గృహా సహాయకురాలిగా నియమించారు. అయితే, సదరు ఇంటి యజమాని వద్ద ఆమె పనిచేయడానికి నిరాకరించింది. దీంతో ఆమెపై దొంగతనం కేసు నమోదు చేయించారు. మొబైల్ ఫోన్‌ను లాక్కొని వేధింపులకు గురి చేశారు.

వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆమె బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను (Indian Embassy) సంప్రదించింది. వారి వద్ద తన గోడును వెళ్లబోసుకుంది. దాంతో ఎంబసీ అధికారులు స్వదేశంలోని ఆమె బంధువులను సంప్రదించారు. ఆ తర్వాత వారి సూచన మేరకు ఆమె బంధువు ఒకరు ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ అధికారులు జాబ్ ఏజెంట్లను సంప్రదించారు. అదే సమయంలో అధికారులు గల్ఫ్-మహారాష్ట్ర బిజినెస్ ఫోరం నుంచి కూడా సహాయం కోరారు. చివరకు పోలీసులు, ఎంబసీ అధికారులు, ఫోరం కృషి ఫలించడంతో బాధిత మహిళ సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది.

Best Countries for Expats: ప్రవాసులకు అన్ని విధాల బెస్ట్ దేశం ఏదో తెలుసా..?


Updated Date - 2023-04-14T20:29:48+05:30 IST