Indian Women’s Hockey Team: విమెన్స్ నేషన్ కప్ హాకీ విజేత ఇండియా.. గ్రాండ్ వెల్కమ్

ABN , First Publish Date - 2022-12-19T19:38:59+05:30 IST

స్పెయిన్‌లోని వేలెన్సియాలో జరిగిన ఎఫ్ఐహెచ్ విమెన్స్ నేషన్స్ కప్ 2022 (FIH Women’s

Indian Women’s Hockey Team: విమెన్స్ నేషన్ కప్ హాకీ విజేత ఇండియా.. గ్రాండ్ వెల్కమ్

న్యూఢిల్లీ: స్పెయిన్‌లోని వేలెన్సియాలో జరిగిన ఎఫ్ఐహెచ్ విమెన్స్ నేషన్స్ కప్ 2022 (FIH Women’s Nations Cup 2022) ప్రారంభ ఎడిషన్‌లో భారత హాకీ అమ్మాయిలు దుమ్మురేపారు. అద్భుత విజయం సాధించి దేశంలో అడుగుపెట్టిన అమ్మాయిల జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఈ విజయంతో 2023-24 ఎఫ్ఐహెచ్ హాకీ విమెన్స్ ప్రొ లీగ్‌లో భారత జట్టుకు స్థానం లభించింది.

ఈ సందర్భంగా కెప్టెన్ సవిత మాట్లాడుతూ.. జట్టు సభ్యులను చూస్తే చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ప్రతి ఒక్కరు 100 శాతం కష్టపడ్డారని ప్రశంసించింది. ప్రారంభం నుంచే మ్యాచ్‌పై దృష్టిసారించినట్టు తెలిపింది. ఇలాంటి జట్టులో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని సవిత సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఏడాది తాము చక్కని ప్రదర్శన కనబరిచామని, మరిన్ని టైటిళ్లు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతామని వివరించింది. వచ్చే ఏడాది ఆసియాకప్‌లో విజయమే ధ్యేయంగా ఆడతామని పేర్కొంది.

ఎఫ్ఐహెచ్ విమెన్స్ నేషన్స్ కప్ 2022 ఫైనల్‌లో స్పెయిన్‌ను కంగుతినిపించిన భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. గుర్జీత్ కౌర్ ఓ గోల్ సాధించింది. టోర్నీ ప్రారంభంలో ఓ లక్ష్యం పెట్టుకున్నామని, చివరికి దానిని సాధించడం ఆనందంగా ఉందని గుర్జీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-12-19T19:44:17+05:30 IST