Indian Expats: కువైత్ లేబర్ మార్కెట్‌లో మనోళ్ల వాటా ఎంతో తెలుసా..?

ABN , First Publish Date - 2023-01-12T13:12:49+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) ప్రవాస కార్మికుల వాటానే అధికం అనే విషయం తెలిసిందే.

Indian Expats: కువైత్ లేబర్ మార్కెట్‌లో మనోళ్ల వాటా ఎంతో తెలుసా..?

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) ప్రవాస కార్మికుల వాటానే అధికం అనే విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన అధికారిక డేటా ప్రకారం గతేడాది సెప్టెంబర్ వరకు ఆ దేశ వర్క్‌ఫోర్స్‌లో కొత్తగా 2.12లక్షల మంది కార్మికులు చేరారు. వారిలో 85,900 మంది వలస కార్మికులే ఉన్నారు. ఇక ఆ దేశం లేబర్ మార్కెట్‌లో (Labor Market) భారతీయ కార్మికుల (Indian Workers) వాటానే ఎక్కువ. కువైత్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో మనోళ్లు దాదాపు 24.1శాతం ఉన్నారట. దాంతో 2022 సెప్టెంబర్ చివరి నాటికి ప్రవాస భారతీయ కార్మికుల సంఖ్య 4,76, 300కి చేరింది. 2021 డిసెంబర్‌లో ఈ సంఖ్య 4,37,100గా ఉంది. ఇందులో డొమెస్టిక్ వర్కర్లు (Domestic Workers) లేరు. వారిని కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా భారీగానే ఉండే అవకాశం ఉంది. భారత్ తర్వాత ఈజిప్ట్ 4,67,070 మంది కార్మికులతో రెండో స్థానంలో ఉంది. కువైత్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 23.6శాతానికి సమానం. కాగా, కువైత్ 4.51లక్షల మంది కార్మికులతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 1.58లక్షల మంది కార్మికులతో బంగ్లాదేశ్ (Bangladesh) నాల్గో స్థానంలో ఉంటే.. 65,260 మందితో ఫిలిప్పీన్స్ ఐదు, 63,680 మందితో సిరియా ఆరు స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - 2023-01-12T13:16:50+05:30 IST