Kuwait: 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ తిరస్కరణ..!

ABN , First Publish Date - 2023-03-28T11:36:28+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Kuwait’s Interior Ministry) 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించడానికి (Renewal of Residency Permits) తిరస్కరించింది.

Kuwait: 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ తిరస్కరణ..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Kuwait’s Interior Ministry) 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించడానికి (Renewal of Residency Permits) తిరస్కరించింది. ఆరు నెలలకు మించి దేశం బయట స్టే చేసిన వలసదారుల నివాస వీసాలను రెన్యువల్ చేయలేదు. ఈ 5వేల మంది ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ కోసం ఆన్‌లైన్ వేదికగా దరఖాస్తు చేసుకున్నారు. దీనికి వారు 6నెలలకు మించి దేశం బయట ఉండడానికి వివిధ కారణాలు చెప్పడం జరిగింది. వాటిలో ఎక్కువగా అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వంటివి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది వలసదారులు కూడా ఇదే కారణంగా ఈ నెలలో తమ ఇఖామాలను (Iqamas) కోల్పోయినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇక మినిస్ట్రీకి చెందిన రెసిడెన్సీ అఫైర్స్ విభాగం (Residency Affairs Department) ఆరు నెలలు దాటి దేశం బయట ఉంటున్న వారి రెసిడెన్సీ పర్మిట్లను ఆటోమెటిక్‌గా వెంటనే క్యాన్సిల్ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఆటోమేటేడ్ ప్రాసెస్‌ను అభివృద్ధి చేసింది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సంయనంతో ప్రవాసుల ఎవరివైతే వర్క్ పర్మిట్ల (Work Permits) గడువు ముగుస్తుందో ఆటోమెటిక్‌గా వారి రెసిడెన్సీ, సివిల్ ఐడీ కార్డులు క్యాన్సిల్ అయిపోతాయని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: బ్రిటన్‌లో మనోళ్లే బెటర్.. అక్కడి వారి కంటే ఎన్నారైలకే సొంతిళ్లు ఎక్కువ.. ఇదొక్కటే కాదండోయ్..!

Updated Date - 2023-03-28T11:36:28+05:30 IST