Kuwait: వలసదారుల విషయంలో మరో సంచలన నిర్ణయం.. ఈసారి టీచర్ల వంతు..!

ABN , First Publish Date - 2023-01-13T08:49:55+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయంలో మరో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.

Kuwait: వలసదారుల విషయంలో మరో సంచలన నిర్ణయం.. ఈసారి టీచర్ల వంతు..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయంలో మరో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. 2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 1,875 మంది ప్రవాస టీచర్లపై వేటు వేసే ప్లాన్‌లో ఉందట. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు మొదలెట్టిందని సంబంధిత వర్గాల సమచారం. విద్య, ఉన్నత విద్య మరియు శాస్త్రీయ పరిశోధనశాఖ మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వాన్ పర్యవేక్షణలో ఇప్పటికే ఈ విషయంలో కసరత్తు జరుగుతుందని, కువైటైజేషన్ పాలసీలో (Kuwaitization Policy) భాగంగా ఎడ్యుకేషనల్ జాబ్స్‌లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

ప్రవాస టీచర్ల స్థానంలో కువైటీలను భర్తీ చేసేలా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుందట విద్యాశాఖ. ఇక తొలి దశలో స్పెషలైజేషన్ లేని 25శాతం మంది ప్రవాస టీచర్లను (Expat Teachers) తొలగించాలని ప్రణాళిక రెడీ చేసిందని తెలుస్తోంది. అలాగే ఇకపై ఏడాదికి కొంత శాతం మేర విదేశీ టీచర్లను కువైటీలతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా కొన్నేళ్ల తర్వాత ఈ ప్రవాస టీచర్ల తొలగింపు అనేది 100 శాతానికి చేరుతుందని, అప్పుడు కేవలం కువైటీ టీచర్లే మిగులుతారనేది విద్యాశాఖ ప్లాన్.

Updated Date - 2023-01-13T08:56:50+05:30 IST