Kuwait: వీసా మోసాలను అరికట్టేందకు కువైత్ కీలక నిర్ణయం.. ఇకపై..
ABN , First Publish Date - 2023-02-05T10:48:15+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వీసా మోసాలను (Visa Frauds) అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వీసా మోసాలను (Visa Frauds) అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఫోర్జరీ, వీసా ట్రాఫికింగ్‌ను (Visa Trafficking) నివారించేందుకు ప్రత్యేకంగా 'కువైత్‌వీసా' (Kuwait Visa App) పేరిట యాప్‌ను తీసుకువస్తుంది. అతి త్వరలోనే యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే కార్మికులకు స్మార్ట్ ఐడీలు కూడా కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందులో కార్మికుడికి సంబంధించిన పూర్తి అధికారిక సమాచారం ఉంటుంది. తద్వారా లేబర్ మార్కెట్‌ను ఆర్గనైజ్ చేయడం సులువు అవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: డైమండ్ నెక్లెస్ ఎత్తుకెళ్లిన ఎలుక.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
ఈ మేరకు మొదటి ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి, తాత్కాలిక డిఫెన్స్ మినిస్టర్ షేక్ తలాల్ అల్ ఖలేద్ కీలక ప్రకటన చేశారు. ఇక ఎలక్ట్రానిక్ 'కువైత్ వీసా' అప్లికేషన్ అనేది కార్మికుడు వారి స్వదేశం నుండి విమానం ఎక్కే ముందు అన్ని ఎంట్రీ వీసాలకు చెల్లుబాటు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈ యాప్ ఎప్పుడు అమలులోకి వస్తుందనే తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ యాప్ ద్వారా కువైత్ సర్కార్ సమాజాన్ని రక్షించడం, అంటు వ్యాధులు ఉన్నవారి ప్రవేశాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.