Kuwait: షాకింగ్ గణాంకాలు.. సంఖ్యపరంగా ప్రవాసులే అధికంగా ఉన్నా.. అందులో మాత్రం కువైటీలదే పైచేయి..!

ABN , First Publish Date - 2023-02-07T08:26:25+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) జనాభాలో దాదాపు 70శాతం మంది ప్రవాసులే (Expats) ఉంటారనే విషయం తెలిసిందే.

Kuwait: షాకింగ్ గణాంకాలు.. సంఖ్యపరంగా ప్రవాసులే అధికంగా ఉన్నా.. అందులో మాత్రం కువైటీలదే పైచేయి..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) జనాభాలో దాదాపు 70శాతం మంది ప్రవాసులే (Expats) ఉంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం 43 లక్షల వరకు జనాభా కలిగిన ఆ దేశంలో 30లక్షల వరకు వలసదారాలు ఉన్నారు. అందులోనూ ఆసియా వాసుల వాటానే అధికం. ఇక భారతీయ ప్రవాసులు (Indian Expats) కూడా భారీగానే ఉంటారు. ఇదిలాఉంటే.. తాజాగా ఆ దేశ ప్రభుత్వం వాహనాలకు సంబంధించి విడుదల చేసిన అధికారిక గణాంకాలు షాకింగ్‌గా ఉన్నాయి. 70శాతం జనాభా ఉన్నా ప్రవాసుల కంటే కేవలం 30 శాతం జనాభా కలిగిన కువైటీలకే ఎక్కువ వాహనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: భూతల స్వర్గం అంటే ఇదేనేమో.. సౌదీలోని ఈ 'రిసార్ట్' విశేషాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Cars.jpg

సగటున ఒక్కొ కువైటీ కుటుంబానికి మూడు కార్లు (Cars) ఉంటే.. అదే ప్రవాస ఫ్యామిలీకి (Expat Family) మాత్రం ఒక్కటే ఉంది. ప్రతి 100 కువైటీ కుటుంబాలు 288 కార్లు కలిగి ఉన్నాయి. అదే ప్రతి 100 వలస కుటుంబాలకు కేవలం 98 కార్లు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి వంద కువైటీ ఫ్యామిలీలు (Kuwaiti Families) 6 మోటార్ సైకిళ్లు, 40 వరకు సైకిళ్లు కలిగి ఉన్నాయి. దీంతో పాటు మరో ఐదు వరకు బగ్గీస్, ట్రైలర్స్, కార్వాన్స్ వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు కలిగి ఉన్నాయని తాజాగా వెలువడిన గణాంకాల ద్వారా తెలుస్తుంది.

Updated Date - 2023-02-07T08:27:56+05:30 IST