Big Alert to Travellers: యూఏఈ వెళ్తున్నారా..? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు లేకుండా చూసుకోండి..!

ABN , First Publish Date - 2023-08-28T10:10:59+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) టూర్‌కు వెళ్తున్నారా..? అయితే ఈ పర్యాటన కోసం మీరు తీసుకెళ్లే మీ లగేజీలో కొన్ని వస్తువులు లేకుండా చూసుకోవడం బెటర్.

Big Alert to Travellers: యూఏఈ వెళ్తున్నారా..? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు లేకుండా చూసుకోండి..!

Big Alert to Travellers: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) టూర్‌కు వెళ్తున్నారా..? అయితే ఈ పర్యాటన కోసం మీరు తీసుకెళ్లే మీ లగేజీలో కొన్ని వస్తువులు లేకుండా చూసుకోవడం బెటర్. ఈ మేరకు నివాసితులు, విదేశీ టూరిస్టులకు (Foreign Tourists) ఆ దేశంలో నిషేధించిన వస్తువుల (Banned Items) జాబితా ఒకటి తాజాగా విడుదలైంది. ఈ జాబితాలోని ఏ చిన్న వస్తువు మీ లగేజీలో ఉన్నాసరే మీకు అక్కడ ఇబ్బందులు తప్పవు. ఇక కొన్ని వస్తువులను మాత్రం యూఏఈ తీసుకెళ్లడానికి ముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అలాంటి వస్తువుల గురించి తెలుసుకుంటే మంచిది. తద్వారా స్థానిక చట్టాలను ఉల్లంఘించకుండా మీ టూర్‌ను సాఫీగా కొనసాగించవచ్చు. ఇక తాజాగా విడుదలైన యూఏఈ (UAE) కి విదేశీ టూరిస్టులు తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

* నియంత్రిత మందులు, మాదకద్రవ్య పదార్థాలు

* ఫ్రోజెన్ పౌల్ట్రీ, పక్షులు

* తమలపాకులు

* నకిలీ/పైరేటెడ్ వస్తువులు, కంటెంట్

* అసభ్యకరమైన పదార్థాలు

* జూదం సాధనాలు, యంత్రాలు

* నకిలీ కరెన్సీ

* చేతబడి, మంత్రవిద్య లేదా చేతబడిలో ఉపయోగించే వస్తువులు

* ఇస్లామిక్ బోధనలు మరియు విలువలకు విరుద్ధంగా లేదా సవాలు చేసే ప్రచురణలు, కళాకృతులు

దుబాయి తీసుకెళ్లేందుకు ముందుగా అనుమతి పొందాల్సిన వస్తువుల జాబితా..

* జంతువులు, మొక్కలు, ఎరువులు

* మందులు, మందులు, వైద్య పరికరాలు

* మీడియా ప్రచురణలు

* ట్రాన్స్‌మిషన్ మరియు వైర్లెస్ పరికరాలు

* మద్య పానీయాలు

* సౌందర్య సాధనాలు

* ప్రదర్శనల కోసం వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు

* ఇ-సిగరెట్లు మరియు ఎలక్ట్రానిక్ హుక్కా

Kuwait: ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం.. ఉల్లంఘనదారుల కోసం మరో ప్లాన్ రెడీ చేసిన గల్ఫ్ దేశం!


Updated Date - 2023-08-28T10:16:03+05:30 IST