UAE jobs: డొమెస్టిక్ వర్కర్లకు కొత్త శాలరీ రూల్.. ఇకపై యజమానులు తప్పనిసరిగా..!

ABN , First Publish Date - 2023-04-02T09:59:00+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) యజమానులు ఇకపై తమ డొమెస్టిక్ వర్కర్లను(Domestic Workers) దేశంలోని వేతన రక్షణ వ్యవస్థలో (Wage Protection System) నమోదు చేసుకోవడం తప్పనిసరి.

UAE jobs: డొమెస్టిక్ వర్కర్లకు కొత్త శాలరీ రూల్.. ఇకపై యజమానులు తప్పనిసరిగా..!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) యజమానులు ఇకపై తమ డొమెస్టిక్ వర్కర్లను(Domestic Workers) దేశంలోని వేతన రక్షణ వ్యవస్థలో (Wage Protection System) నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ వేతన పథకంలో మరో 19 వృత్తులు జతకానున్నాయి. కాగా, డబ్ల్యూపీఎస్ అనేది ఎలక్ట్రానిక్ శాలరీ బదిలీ వ్యవస్థ. ఇది బ్యాంకులు, మనీ ఎక్స్ఛేంజ్ సేవలను అందించడానికి ఆమోదించబడిన ఆర్థిక సంస్థల ద్వారా వేతనాలు చెల్లించడానికి సంస్థలను అనుమతిస్తుంది. ఈ వ్యవస్థతో యూఏఈ అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తారు.

ఏప్రిల్ నెల ప్రారంభంలో మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources, Emiratisation).. యజమానులు తమ గృహ కార్మికులను డబ్ల్యూపీఎస్‌లో నమోదు చేసుకోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి గృహ కార్మికుల కేటగిరీ కింద 5 వృత్తులు (ప్రైవేట్ వ్యవసాయ ఇంజనీర్, ప్రజా సంబంధాల అధికారి, హౌస్ కీపర్, పర్సనల్ ట్యూటర్, పర్సనల్ ట్రైనర్) తప్పనిసరిగా వ్యవస్థలో ఉండాలని పేర్కొంది. అయితే, పెండింగ్‌లో లేబర్ ఫిర్యాదులు ఉన్న గృహ కార్మికులు లేదా నిరుద్యోగులు లేదా పనికి హాజరుకాని రిజిస్టర్డ్ నోటీసులు ఉన్నవారికి ఈ డబ్ల్యూపీఎస్ నిబంధనల నుంచి మినహాయించారు.

UK: స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లది అదే పంథా.. పేరెంట్స్‌పై వేధింపులతో కటకటాలపాలైన ఎన్నారై!



ఇక గృహ కార్మికుల కేటగిరీ కిందకు వచ్చే మరో 19 వృత్తులు ఇవే..

హౌస్ మెయిడ్, సెయిలర్/బోట్‌మ్యాన్, సెక్యూరిటీ గార్డు, హౌస్ షెపర్డ్, ఇంటి గుర్రపు గ్రూమర్, గృహ ఫాల్కన్ ట్రైనర్, ఫిజికల్ లేబర్ వర్కర్, హౌస్ కీపర్, కుక్, నానీ/బేబీ సిట్టర్, రైతు, తోటమాలి, వ్యక్తిగత డ్రైవర్, ప్రైవేట్ వ్యవసాయ ఇంజనీర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పర్సనల్ నర్సు, పర్సనల్ ట్యూటర్, పర్సనల్ ట్రైనర్.

Indians: యూఎస్-కెనడా బార్డర్‌లో విషాదకర ఘటన.. సరిహద్దు దాటుతూ 8మంది మృత్యువాత.. మృతుల్లో భారతీయ కుటుంబం..!

Updated Date - 2023-04-02T12:20:46+05:30 IST