Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో భారతీయురాలు.. ఆదిలోనే ట్రంప్‌కు భారీ షాక్‌!

ABN , First Publish Date - 2023-02-15T07:25:39+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నిక్కి హెలీ మంగళవారం ప్రకటించారు.

Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో భారతీయురాలు.. ఆదిలోనే ట్రంప్‌కు భారీ షాక్‌!

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా

ప్రకటించిన రిపబ్లికన్‌ నేత నిక్కి హెలీ

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 14: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నిక్కి హెలీ మంగళవారం ప్రకటించారు. దీంతో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని చూస్తున్న అదే పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. భారత సంతతికి చెందిన 51 ఏళ్ల హెలీ.. గతంలో సౌత్‌ కరోలినా గవర్నర్‌గా, యునైటెడ్‌ నేషన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా, ట్రంప్‌ హయాంలో కేబినెట్‌ అధికారిగా కూడా పనిచేశారు. రెండేళ్ల క్రితం నిక్కి హెలీ మాట్లాడుతూ.. 2024లో అధ్యక్ష పదవి కోసం తన బాస్‌ అయిన ట్రంప్‌తో పోటీపడబోనని చెప్పారు. అయితే కొద్ది నెలలుగా ఆమె తన మనసు మార్చుకున్నారు. రాబోయే నెలల్లో ఆమె అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు భారత సంతతి వ్యాపారవేత్త, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వివేక్‌ రామస్వామి కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అమెరికాలో ఔషధాల తయారీ రంగంలో విజయవంతమైన బయోటెక్‌ వ్యవస్థాపకుడిగా వివేక్‌ పేరు తెచ్చుకున్నారు.

Updated Date - 2023-02-15T07:28:42+05:30 IST